``అతడు వాట్సాప్ లో నీలి చిత్రాలు పంపాడు.. శృంగారంలో పాల్గొన్నప్పటి క్లిప్ ని వైరల్ చేసాడు. అంతేకాదు.. తనను ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ భయభ్రాంతులకు గురి చేసాడు``... ఇలాంటి ఆరోపణలు చేసిన లేడి నిర్మాత యి జౌ చైనీ సినిమా రంగంలో ఫిలింమేకర్ గా ఫేమస్. మహిళా నిర్మాత నుంచి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న అతడు మరెవరో కాదు. `అవెంజర్స్`(2011), `థోర్` చిత్రాలతో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు జెరోమ్ రెన్నర్.
రెన్నర్ తో రెండు సినిమాలకు పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న చైనీ నిర్మాత జౌ అతడితో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత అతడితో శృంగార సంబంధంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యా చెడటంతో అతడు వాట్సాప్ లో షేర్ చేసిన శృంగార వీడియో క్లిప్ ని డెయిలీ మెయిల్ అనే పత్రికకు పంపారు. అయితే ఈ మొత్తం వివాదంలో చైనీ నిర్మాత చేసిన ప్రధాన ఆరోపణ సారాంశం వేరుగా ఉంది.
ఇటీవల పన్ను బాదుడు పేరుతో బెదిరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో భారత్, చైనా సహా పలు దేశాలు విసిగిపోయిన సంగతి తెలిసిందే. భారతీయులతో పాటు విదేశీయులపైనా ట్రంప్ అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో యుఎస్ పాస్ పోర్ట్- ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో అమెరికన్ నటుడైన రెన్నర్ బెదిరించడాన్ని చైనీ నిర్మాత జౌ హైలైట్ చేసింది.





BB9: తనూజ క్రేజ్ తగ్గేలా ఇమ్మాన్యుయేల్ ప్లాన్

Loading..