సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న మెయిన్ లీడ్ లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ద గర్ల్ ఫ్రెండ్ మూవీకి థియేటర్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. గీత ఆర్ట్స్ బ్యానర్, రష్మిక మెయిన్ లీడ్ అన్ని గర్ల్ ఫ్రెండ్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేసినా.. ఇది హీరోయిన్ సెంట్రిక్ మూవీ కావడంతో గర్ల్ ఫ్రెండ్ కి ఓపెనింగ్స్ అంతగా రాలేదు.
ఇక గర్ల్ ఫ్రెండ్ కి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ కనిపించినా, సినీ విమర్శకులు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతున్నా గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్ చాలా వీక్ గా ఉన్నాయి. మొదటిరోజు ఓపెనింగ్స్ తో నిరాశపరిచిన గర్ల్ ఫ్రెండ్ సెకండ్ డే కి పికప్ అవుతుంది అనుకున్నారు.
కానీ మౌత్ టాక్ తో సంబంధమే లేకుండా గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. రష్మిక జోరు గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్ పై ప్రభావం చూపించకపోవడం డిజప్పాయింట్ చేసే విషయమే. మరి ఈ వీకేండ్ లో గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో అనేది రేపటికి గాని క్లారిటీ రాదు.





నటుడిపై లేడి నిర్మాత ఫిర్యాదు

Loading..