బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకు నామినేషన్స్ లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడుతూ అందరితో మంచి ర్యాపొ మైంటైన్ చేస్తూ హౌస్ లోని అందరిని ఎంటర్టైన్ చేస్తూ హోస్ట్ నాగార్జున శెభాష్ అనిపించుకునే ఇమ్మాన్యువల్ ఒక్కసారిగా తన ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తున్న తనూజ పై యాంటీ గా మారిపోవడం చాలామంది జీర్ణించుకోలేకపోయారు.
ఇమ్మాన్యువల్-తనూజ బిగ్ బాస్ స్టార్టింగ్ వీక్స్ లో చాలా ఫ్రెండ్లిగా సరదాగా ఉండేవారు. కానీ వారిప్పుడు కలిసి మట్లాడుకున్న సందర్భం కానీ, సపోర్ట్ చేసుకున్న సందర్భం కానీ కనిపించడం లేదు. కారణం ఇమ్మాన్యువల్ తనూజ ని దూరం పెట్టేసాడు. కారణం ఎందుకు అంటే వైల్డ్ కార్డు ఎంట్రీ గా వచ్చినవారు అయేషా, రమ్య, సాయి వాళ్ళు తనూజ కి బయట విపరీతమైన క్రేజ్ ఉంది, ఆమెకు ఆడియన్స్ సపోర్ట్ ఉంది, ఆమె గేమ్ గుడ్ అని చెప్పారు.
దానితో తనూజ తనకు పోటీ వస్తుంది అని తనూజ ను నామినేషన్స్ లోకి పెట్టడం, ఆమెకు సపోర్ట్ చెయ్యకుండా దివ్య తో కలిసి ఆమెను సపోర్ట్ చేసి గేమ్ ఆడడం, రెండోసారి కెప్టెన్సీ టాస్క్ లో తనూజ అన్యాయమవడానికి కారణం ఇమ్మాన్యువల్ అయ్యాడు. ఇదంతా ఆమె గ్రాఫ్, క్రేజ్ తగ్గించేందుకు ఇమ్మాన్యువల్ ఆడుతున్న ఆటగా తనూజ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు.
తనూజ తనకి కాంపిటేషన్ వస్తుంది అని భయపడే తనూజ ని టార్గెట్ చేస్తూ తన ముసుగుని తానే తీసుకుంటున్నాడు ఇమ్మాన్యువల్ అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు. .





మటన్ సూప్ డైరెక్టర్ కి మంచి గుర్తింపు 

Loading..