కొన్ని సినిమాలను చూస్తే భలే మంచి పాయింట్‌తో తెరకెక్కించారే.. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది.. దర్శకుడు కొత్తవాడైనా సినిమాను హ్యాండిల్ చేసిన విధానం బావుందని అంటూ ఉంటారు ఆడియన్స్. ఈమధ్య కాలంలో ఓ వైవిధ్యమైన పాయింట్‌తో తెరకెక్కిన సినిమా మటన్ సూప్. జర్నలిస్ట్ నుంచి దర్శకత్వ బాధ్యతలు ఎత్తుకుని వైవిధ్యమైన పాయింట్‌తో రామచంద్ర వట్టికూటి ఈ మటన్ సూప్ చిత్రాన్ని తెరకెక్కించాడు.
దర్శకత్వం కొత్తే అయినప్పటికీ గ్రిప్పింగ్ పాయింట్ తో ఆ సినిమాను రూపొందిన తీరు అభినందనీయం అంటూ సినీ విమర్శకులు మాట్లాడుతున్నారు. మన చుట్టూ చాలా విషయాలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు మనం వాటిని పట్టించుకోం. ఆ విషయాలు తెలిస్తే వామ్మో సినిమాలో కూడా ఇలా ఆలోచించరేమో అని అనుకుంటుంటాం. అలాంటి కథాంశంతోనే డైరెక్టర్ రామచంద్ర మటన్ సూప్ సినిమాను తెరకెక్కించాడు.
అక్టోబర్ 10న విడుదలైన సినిమాలన్నింటిలో మటన్ సూప్ సినిమా విలక్షణంగా ప్రేక్షకులకు కనిపించింది. చాలా తక్కువ బడ్జెట్‌లో కొత్త నటీనటులతో దర్శకుడు ఆయన టీమ్ ఎంతోకష్టపడి ఈ సినిమాను రూపొందించారు. మంచి కథాంశం, గ్రిప్పింగ్ నెరేషన్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుందని అందరూ మాట్లాడుకున్నారు. కొత్త, వైవిధ్యమైన సినిమాలను చూడాలనుకునే ప్రేక్షకులకు మటన్ సూప్ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
కొత్త పాయింట్‌ను ఎంపిక చేసుకోవటమే కాదు.. దాన్ని స్క్రీన్‌పైకి తనకున్న పరిమిత బడ్జెట్‌లో ప్రేక్షకులు మెచ్చేలా ఎలా తెరకెక్కించాలనే విషయం తెలియాలంటే ప్యాషన్ ఉండాలి. అలాంటి ఆసక్తితో దర్శకుడు రామచంద్ర వట్టికూటి ఈ మటన్ సూప్ చిత్రాన్ని తెరకెక్కించాడు. దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉండడంతో ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ఫ్యాన్సీ రేట్లతో మటన్ సూప్ మేకర్స్ ని సంప్రదిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.





కేటీఆర్ ప్రచారం-శ్రీలీల ఐటెం ఒకేలా ఉంది 

Loading..