హీరో సుధీర్ బాబు సక్సెస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు. ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పని చేస్తున్నాడు. కానీ సుధీర్ బాబు కి సక్సెస్ అనేది అల్లంత దూరంలోనే ఆగిపోతుంది. రొటీన్ గా కాకుండా డిఫ్రెంట్ కథలతో సినిమాలు చేస్తున్నా సుధీర్ బాబు ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా తెలుగు, హిందీ లాంగ్వేజెస్ లో చేసిన జటాధర సుధీర్ బాబు ని ఆయన అభిమానులు నిరాశపరిచింది.
భారీ ప్రమోషన్స్, బాలీవుడ్ తారలు నటించడం, సుధీర్ బాబు డిఫ్రెంట్ గెటప్ లో కనిపించడం తో జటాధర అంచనాలు పెరిగినప్పటికి ఓపెనింగ్స్ విషయంలోనూ జటాధర ఫెయిల్ అయ్యింది. అంతేకాదు మొదటిరోజు మొదటి షో కి డివైడ్ టాక్ మొదలు కావడంతో జటాధర కోసం ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లే ఆలోచనను విరమించుకుంటున్నారు.
ఆడియన్స్ మాత్రమే కాదు క్రిటిక్స్ కూడా జటాధర కు దారుణమైన పూర్ రేటింగ్స్ ఇచ్చారు. హారర్, డివోషన్ ని మిక్స్ చేసి తెరకెక్కించిన జటాధర చిత్రం ఆడియన్స్ ను పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. అంతేకాదు సుధీర్ బాబు ఖాతాలో ఓ భారీ డిజాస్టర్ చేరింది. జటాధర కి ఓపెనింగ్స్ తగ్గడానికి రశ్మిక గర్ల్ ఫ్రెండ్ కూడా కారణమైంది. గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ అయినా, రష్మిక ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. అందుకే ఆ సినిమాకి ఓపెనింగ్స్ బావున్నాయి.
ఇక సినిమా విడుదలయ్యాక గర్ల్ ఫ్రెండ్ కి పాజిటివ్ రివ్యూస్, యూత్ నుంచి సినిమా బావుంది అంటూ సోషల్ మీడియా లో గుడ్ వైబ్స్ స్టార్ట్ అవడంతో జటాధర ను పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు. మరి సుధీర్ బాబు ఇకపై ఎలా సర్వైవ్ అవుతాడో చూడాలి.




BB9: టాప్ 5 ని చూపించిన నాగార్జున 

Loading..