బిగ్ బాస్ హౌస్ కి శనివారం వచ్చింది అంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తారు. శనివారం అంటే హౌస్ మేట్స్ కి నాగార్జున ఇచ్చే క్లాస్ లు, తప్పు నాగ్ ఫైర్ అవడం అన్ని ఆడియన్స్ కి క్రేజీగా కనిపిస్తాయి. కానీ ఈవారం బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ కి వెళతారో అనేది ఆడియన్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని హౌస్ మేట్స్ కి చూపించారు. అంటే కాదు టాప్ 7 కి బిగ్ బాస్ కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నట్టుగా చెప్పారు నాగ్.
ఆడియన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ అంటే 100 శాతం సపోర్ట్ సుమన్ శెట్టి కి ఉంది. ఆయన ఆట తీరు బావుంది అంటూ, 100 శాతం సపోర్ట్ తో నువ్వు వచ్చే వారం డైరెక్ట్ కంటెండర్ అవుతాడు.. కానీ అది భరణి ఫ్యామిలీ వీక్ శాక్రిఫైజ్ చేస్తే అన్నారు. ఆతర్వాత రెండొ స్థానంలో ఇమ్మాన్యువల్ ఉన్నాడు. ఇమ్మాన్యువల్ కి తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ ఇచ్చింది, అది కావాలంటే గౌరవం బ్లెస్సింగ్ పవర్ శాక్రిఫైజ్ చెయ్యాలన్నాడు.
ఇమ్మాన్యువల్ గౌరవ్ ని అడగకుండా ఆ వాయిస్ నోట్ వినేసాడు. దానితో ఓ చిన్న వాయిస్ నోట్ కోసం నా పవర్ వాడేసావ్ అంటూ ఫీలయ్యాడు గౌరవ్. ఇక తనూజ మూడో ప్లేస్ లో ఉంది. ఆమె సిస్టర్ కి మ్యారేజ్ సెట్ అయ్యింది, ఆ నోట్ చదవాలంటే దాని కోసం కళ్యాణ్ కెప్టెన్ అయినా ఇమ్యూనిటీ ఉండదు అన్నారు.
కళ్యాణ్ టాప్ 4 లో ఉన్నాడు. టాప్ 5 లో ఉన్న రీతూ కి ఆమె ఫాదర్ షర్ట్ వచ్చింది, అందుకు సంజన శారీస్ స్టార్ రూమ్ లో వేసేయాలి అని నాగ్ కండిషన్ పెట్టారు. ఏది ఏమైనా ఈ ప్రోమోతో టాప్ 5 ఎవరు అనేది అయ్యింది.




48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ 

Loading..