ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ విషయంలో, పార్టీలోని ఎమ్యెల్యేలు, మంత్రులు, కార్యకర్తల విషయంలో ఎంత నిబద్దతతో ఉంటారో, ఎమ్యెల్యేలు తప్పు చేసినా, సొంత వారు తప్పు చేసినా చాలా సీరియస్ అవుతారు. ఇప్పుడు తిరువూరు ఎమ్యెల్యే కొలికపూడి పై ఆరోపణలు రావడం, ఆయనపై కమిటీ వెయ్యడం, కొలికపూడి పార్టీ కి నష్టం చేసే విధంగా నడుచుకుంటున్నారని నివేదికలు రావడంతో ముఖ్యమంత్రి ఎమ్యెల్యేలపై రివ్యూ మీటింగ్ వేశారు.
అందులో భాగంగా 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వీరంతా పార్టీలో ఉన్నప్పటికి.. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో అంటే పెన్షన్ల పంపిణీ, CMRF చెక్‍ల పంపిణీలో పాల్గొనని ఆ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం అయిన చంద్రబాబు తో పాటుగా పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందే అని చంద్రబాబు చెప్పారు. కానీ కొంతమంది ముఖ్యంగా 48 ఎమ్మెఎల్యేలు పెన్షన్ పంపిణీలో పాల్గొనకుండా సైలెంట్ గా ఉండడంతో సీరియస్ అయిన చంద్రబాబు ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించడం హాట్ టాపిక్ అయ్యింది.




డేటింగ్ అతనితో-పెళ్లి విజయ్ తో: రష్మిక 

Loading..