ఇప్పటికే రష్మిక మందన్న లైఫ్ పార్ట్నర్ ఫిక్స్ అయ్యాడు. హీరో విజయ్ దేవరకొండ ను ప్రేమించి వచ్చే ఏడాది ఫిబ్రవరి లోనే వివాహమాడబోతుంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ను గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక ఆ విషయాన్నీ బయటపెట్టడం లేదు.
రష్మిక ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో సూపర్ హిట్ అందుకుంది. తాజాగా రష్మిక ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు ఆమె ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ ఇచ్చింది. నిజంగా జెన్యూన్ గా చెప్పాలంటే నన్ను లోతుగా అర్ధం చేసుకునే వ్యక్తి నాకు కావాలి. ఏ విషయాన్ని అయినా నావైపు నుంచి ఆలోచిస్తూ అర్థం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే వ్యక్తి కావాలి..
మంచి మనసే కాదు దానికి తగిన వ్యక్తిత్వం ఉన్న మనిషి, నాకోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి. అలాంటి లైఫ్ పార్ట్నర్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్తా అంటూ రష్మిక చెప్పిన మాటలు విని అవన్నీ విజయ్ లో ఉన్న క్వాలిటీస్ అందుకే రష్మిక విజయ్ ని పెళ్లాడుతుంది అనుకుంటూనే..
అలాగే డేటింగ్ ఎవరితో చేస్తారు, పెళ్లి ఎవరిని చేసుకుంటారని అని రష్మిక ను అడిగితె.. డేట్ అయితే యానిమేషన్ క్యారెక్టర్ నరుటో తో చేస్తా, కానీ పెళ్లి మాత్రం విజయ్ తో అని చెప్పడంతో అక్కడ ఉన్నవారు కేరింతలు కొట్టారు. అలా రష్మిక ఆ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తో పెళ్లి పై ఓపెన్ అయ్యింది.




ఎన్టీఆర్ హీరోయిన్ సైబర్ వార్నింగ్ 

Loading..