ఈమధ్యన సైబర్ నేరాలు ఎంతగా పెరిగిపోయాయో అందరూ చూస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లో నుంచి డబ్బు ఎలా కొట్టేయ్యాలా, పర్సనల్ డేటా ఎలా చోరీ అని సైబర్ నేరగాళ్లు చాపకింద నీరులా మారుతున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్ల బారిన ఓ హీరోయిన్ పడడమే కాదు ఆమె అది ఎంత పెద్ద సీరియస్ నేరమో తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది.
కన్నడ క్రేజీ హీరోయిన్ కాంతార చాప్టర్ 1 తో 800 కోట్ల హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసిన రుక్మిణి వసంత్ ఇప్పుడు తెలుగులోకి ఎన్టీఆర్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఓ వ్యక్తి ఫోన్ నెంబర్(9445893273) నుంచి అందరికి ఫోన్ చేసి రుక్మిణి వసంత్ వాయిస్ తో మట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ.. అభిమానులు, సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు, బ్రాండ్ ప్రతినిధులు.. అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆ విషయం రుక్మిణి వసంత్ దృష్టికి రావడంతో ఆమె ఈ ఫ్రాడ్ కాల్స్ పై మట్లాడుతూ..
అసలు ఆ ఫోన్ నెంబర్ నాది కాదు. ఈ నెంబర్ నుంచి ఫోన్ లేదా మెసేజ్ వస్తే స్పందించవద్దు. నా పేరును ఉపయోగించడం, నకిలీ వాయిస్ తో ఇతరులను మోసం చేయడం ఒక సీరియస్ సైబర్ నేరం. ఇందులో ఎవరి ప్రమేయమున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను. అవసరమైతే పోలీసు కేసులు కూడా నమోదు చేస్తాను అంటూ రుక్మిణి వసంత్ సదరు వ్యక్తికి స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చింది.




BB9: ఈ వారం డేంజర్ లో ఉంది ఎవరంటే.. 

Loading..