కోలీవుడ్ లో స్టార్స్ హీరోస్ విజయ్, అజిత్ ల మధ్యన ఈగో క్లాష్ ఉంది అంటూ ప్రచారం జరగడమే కాదు విజయ్ అభిమానులు, అజిత్ అభిమానులు గొడవలు పడుతూ సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అజిత్ సినిమాని కిల్ చెయ్యాలని విజయ్ ఫ్యాన్స్, విజయ్ సినిమాలను చంపేయాలని అజిత్ ఫ్యాన్స్ కంకణం కట్టుకుంటారు.
ఈ అభిమానుల గొడవలపై అటు అజిత్ కానీ, ఇటు విజయ్ కానీ ఎన్నడూ స్పందించరు. కానీ తాజాగా అజిత్ అభిమానుల అంతర్యుద్ధం పై పెదవి విప్పడమే కాదు విజయ్ తో తనకున్న గొడవల గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఆయన.
కొంతమంది విజయ్ కి నాకు మధ్య అపోహలు సృష్టిస్తున్నారు. ఆ అపోహలు చూసే అభిమానులు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. అలా లేనిపోని అపోహలు సృష్టించేవారంతా సైలెంట్ గా ఉంటే అందరికీ బాగుంటుంది. నేను ఎప్పుడూ విజయ్ కి ఎప్పుడు మంచి జరగాలనే కోరుకుంటాను. ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటాను అంటూ అజిత్ విజయ్ తో గొడవ పై క్లారిటీ ఇచ్చారు.




ఏపీ ప్రభుత్వాన్ని తక్కువంచనా వేశారు 

Loading..