ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో విజయాన్ని సొంతం చేసుకున్న టీమ్ ఇండియాని ప్రధాని మోడీ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు మెచ్చుకున్నారు. ఇండియాకి ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టిన మహిళా క్రికెటర్స్ ని వెయ్యి నోళ్ళ పొగిడేశారు. ఏ రాష్ట్రం నుంచి ఈ వరల్డ్ కప్ క్రికెట్ కి ఆడారో వాళ్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నజరానాలు ప్రకటించాయి.
ఇక క్రీడాకారులను ప్రోత్సహిస్తూ.. క్రీడలకు అధిక ప్రాధాన్యత నిచ్చే ఏపీ ప్రభుత్వం క్రికెట్ లో వరల్డ్ కప్ గెలిచినా ఏపీకి చెందిన శ్రీ చరణి కి ఎలాంటి నజరానా ప్రకటించలేదు అంటూ బ్లూ మీడియా వార్తలు వండి వార్చింది. ప్రతి క్రీడని ప్రోత్సహించే ఏపీ ప్రభుత్వంపై బ్లూ మీడియా బురద జల్లే పని చేసింది. కానీ ఏపీ ప్రభుత్వాన్ని బ్లూ మీడియా తక్కువ అంచనా వేసింది,.
ఈరోజు శుక్రవారం శ్రీ చరణి ని ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందే గన్నవరం విమానాశ్రయంలో దిగిన శ్రీ చరణికి ఏపీ మంత్రులు ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచి మంత్రులంతా ఆమెతో పాటు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన శ్రీ చరణి తనతో పాటుగా మిగతా క్రీడాకారులు సంతకాలు చేసిన టీమిండియా జెర్సీని సీఎం బాబు కి బహూకరించింది. శ్రీ చరణి అభిమానంతో ఇచ్చిన ఆ జెర్సీని సీఎం చంద్రబాబు ఆప్యాయంగా స్వీకరించారు. శుక్రవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీ చరణి భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్టు తెలిపారు. దీంతో పాటు కడపలో ఇల్లు నిర్మించుకునేందుకు వెయ్యి చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తున్నామని, దానితో పాటుగా గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.




పెద్ది సాంగ్: రామ్ చరణ్ స్టెప్స్ - జాన్వీ అందాలు 

Loading..