డిజిటల్ మీడియా- యూట్యూబ్ రాకతో జర్నలిజంలో పరిణామాలు ఎలా మారాయో చూస్తున్నదే. జర్నలిజంలో విలువలను ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. దీనికి కారణం ఒక్కోసారి సమావేశ సందర్భంతో పని లేకుండా, అసంబద్ధమైన ప్రశ్నలతో కొందరు యూట్యూబర్లు విసిగించడమే కారణం. ఇప్పుడు అలాంటి ఒక ప్రశ్నకు ప్రముఖ తమిళ హీరోయిన్ గౌరి కిషన్ మొత్తం మీడియాపై ఫైర్ అయ్యారు.
`అదర్స్` సినిమా విడుదల ప్రచార సభలో ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నటి గౌరీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మీ బరువు ఎంత? అంటూ అతడు సినిమాతో సంబంధం లేని ప్రశ్న అడగడంతో దీనిని చిత్ర కథానాయిక గౌరి కిషన్ నిలదీసే ప్రయత్నం చేసారు. బరువు ఎక్కువగా ఉన్నా, నన్ను ఎంపిక చేసుకోవడం దర్శకుడి ఛాయిస్ అని, బాడీ షేమింగ్ చేస్తూ తనను కించపరచడం సరికాదని గౌరీ యూట్యూబర్లతో వాదనకు దిగారు. ఓవైపు తన నిర్మాత మీడియాకు సర్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా, తనకు అవమానం జరిగిందంటూ గౌరి పదే పదే మీడియాపై ఎదురు దాడికి దిగడంతో సమావేశం మరింత వేడెక్కింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
చాలా మంది కథానాయికలు సోషల్ మీడియాల్లో బాడీ షేమింగ్ కి పాల్పడే వ్యక్తుల గురించి చెబుతూ.. ఆవేదన చెందారు. ఇప్పుడు మీడియా ఎదుటే అధిక బరువు గురించి అసందర్భపు ప్రశ్న అడిగినందుకు గౌరి ఇలా తీవ్రంగా స్పందించారు. ఇది స్టుపిడ్ క్వశ్చన్ అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో ఇలాంటి ప్రశ్న అడిగిన యూట్యూబర్ కంట తడి పెట్టుకున్నారని కూడా కోలీవుడ్ మీడియాలు పేర్కొన్నాయి. భావోద్వేగం అదుపు తప్పడంతో నటి గౌరి కళ్లు ఎర్రబారాయి.




గ్లొబ్ గల్లంతు చేద్దాం 

Loading..