Advertisementt

కింగ్ ఖాన్‌ని డైరెక్ట్ చేస్తున్న ఆర్య‌న్

Fri 07th Nov 2025 09:41 AM
shah rukh khan  కింగ్ ఖాన్‌ని డైరెక్ట్ చేస్తున్న ఆర్య‌న్
Sharuk Khan in Aaryan direction కింగ్ ఖాన్‌ని డైరెక్ట్ చేస్తున్న ఆర్య‌న్
Advertisement
Ads by CJ

కింగ్ ఖాన్ షారూఖ్ బాలీవుడ్‌లో ఎంద‌రో దిగ్గ‌జ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `కింగ్`లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో కుమార్తె సుహానా ఖాన్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌ఠాన్ - జ‌వాన్ లాంటి భారీ విజ‌యాల త‌ర్వాత షారూఖ్ మ‌రోసారి పాన్ ఇండియా మార్కెట్లో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో అత‌డు మ‌రో ప్ర‌యోగానికి రెడీ అవుతుండ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను పెంచుతోంది.

తాజా స‌మాచారం మేర‌కు... కింగ్ ఖాన్ షారూఖ్ త‌దుప‌రి ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తార‌ని తెలుస్తోంది. ఆర్య‌న్ ఖాన్ ఇటీవ‌లే `ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్` వెబ్ సిరీస్ తో అంద‌రి దృష్టిని త‌న‌వైపున‌కు తిప్పుకున్నాడు. సినీ ప్ర‌ముఖుల వ్య‌వ‌హారికాల‌పై సెటైరిక‌ల్ డ్రామాగా రూపొందించిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్య‌న్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది.

ఆర్య‌న్ త‌న రెండో చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త‌ర్వాత త‌న తండ్రి షారూఖ్ తో ప‌ని చేస్తార‌ని తెలిసింది. ఆర్య‌న్ కి ఇది మూడో సినిమా అవుతుంది. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. 2026 ఆరంభంలో అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. 

Sharuk Khan in Aaryan direction:

  Shah Rukh Khan Under His Son Direction  

Tags:   SHAH RUKH KHAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ