Advertisementt

చివ‌రికి ఈమెతోను స్టార్ హీరో బ్రేక‌ప్

Thu 06th Nov 2025 09:11 PM
hero  చివ‌రికి ఈమెతోను స్టార్ హీరో బ్రేక‌ప్
Star Hero చివ‌రికి ఈమెతోను స్టార్ హీరో బ్రేక‌ప్
Advertisement
Ads by CJ

అత‌డు వెండితెర‌పై అత్యంత సాహ‌సోపేత‌మైన యాక్ష‌న్ విన్యాసాల‌తో క‌ట్టి ప‌డేస్తాడు. తెర‌పై అత‌డు క‌నిపిస్తే యూత్ ఉద్రేకంతో ఊగిపోతారు. అయితే అలాంటి ఇమేజ్ ఉన్న అత‌డు ఆప్ ద స్క్రీన్ గాళ్స్ తో రొమాన్స్ చేయ‌డంలోను అంతే స్పీడ్ చూపిస్తాడు. ఇప్ప‌టికే ముగ్గురు భార్య‌ల‌కు విడాకులిచ్చాడు. మ‌రో ఇద్ద‌రితో బ్రేక‌ప్ లు అయ్యాయి. కానీ ఇప్పుడు 60 ప్ల‌స్ ఏజ్ లో 35 ప్ల‌స్ అమ్మాయితో షికార్లు చేస్తూ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో కొస్తున్నాడు. ఈ జంట కొన్ని నెల‌లుగా చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేసిన ఫోటోలు, వీడియోలు కూడా మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఇక నేడో రేపో పెళ్లికి భాజా మోగుతుంద‌ని కూడా అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని ట్విస్టు. అక‌స్మాత్తుగా ఇప్పుడు ఈ జోడీ బ్రేక‌ప్ అయ్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది నిజంగా ఊహించ‌నిది. దాదాపు పెళ్లి వ‌ర‌కూ చేరుకున్న బంధం బ్రేక్ అవ్వ‌డం అభిమానుల‌కు పెద్ద‌ షాకిస్తోంది.

అస‌లింత‌కీ ఎవ‌రు ఈ సెల‌బ్రిటీ క‌పుల్? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. మిష‌న్ ఇంపాజిబుల్ ఫేం, పాపుల‌ర్ హాలీవుడ్ యాక్ష‌న్ హీరో టామ్ క్రూజ్ (63).. అత‌డి ప్రేయ‌సి అనా డి (37) గురించే. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అనూహ్యంగా మ‌న‌స్ఫ‌ర్థ‌లు త‌లెత్తాయి. అత‌డు నియంత్రిస్తున్నాడ‌నే భావ‌న ఆమెను ఇబ్బందికి గురి చేసింది. చివ‌రికి అతడి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయ‌డం మానేయ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్యా శూన్య‌త ఏర్ప‌డింది. ఇక ఈ జంట మ‌ధ్య రిపెయిర్లు చేయ‌డానికి ఏమీ లేదు. వారు విడిపోయారు! అంటూ స‌న్నిహితులు వెల్ల‌డించారు.

Star Hero:

Star Hero breakup

Tags:   HERO
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ