నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరికొన్ని గంటల్లో గర్ల్ ఫ్రెండ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక చేసిన ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రష్మిక కి ఈ ఏడాది చాలా స్పెషల్.. ఆమె నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలవడమే కాదు.. ఇదే ఏడాది తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
రష్మిక-విజయ్ దేవరకొండ నిశ్చితార్ధం సైలెంట్ గా హైదరాబాద్ లోనే జరిగినా రష్మిక, విజయ్ దేవరకొండ చేతి వెళ్లకున్న ఎంగేజ్మెంట్ ఉంగరాలు మాత్రం హైలెట్ అవుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి పెట్టాలెక్కుతుంది అన్నప్పటికీ ప్రోపర్ గా మ్యారేజ్ డేట్ మాత్రం బయటికి రాలేదు.
తాజాగా రష్మిక-విజయ్ దేవరకొండ ల వివాహానికి పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేశారనే టాక్ వినబడుతుంది. ఫిబ్రవరి 26 న విజయ్ దేవరకొండ-రష్మికలు ఏడడుగులు నడిచే ముహూర్తం ఫిక్స్ అయ్యింది అని, విజయ్ రశ్మిక మెడలో తాళి కడతాడని తెలుస్తుంది. అఫీషియల్ గా ఈ డేట్ బయటికి రాకపోయినా.. ఫిబ్రవరి 26 నే ఈ జంట వివాహం చేసుకోబోతుంది అంటున్నారు.




టాక్సిక్: రా అండ్ రస్టిక్- రుక్మిణి వసంత్ 

Loading..