పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ పై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి నిర్మాణ సంస్థ చెక్ పెట్టింది. జనవరి 9 నుంచి మరోసారి రాజా సాబ్ వాయిదా ఊహాగానాలకు ప్రొడక్షన్ సంస్థ ప్రెస్ నోట్ తో క్లారిటీ ఇచ్చారు. రాజా సాబ్ డిసెంబర్ 5 కె రెడీ అవుతుంది. కానీ పండగ సీజన్ వల్ల జనవరి 9 అన్నాము.
రాజా సాబ్ జనవరి 9 కి రిలీజ్ పక్కా, డిసెంబర్ లో అమెరికాలో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చారు. మరి రాజా సాబ్ రూమర్స్ కి చెక్ పెట్టారు కానీ.. ప్రోపర్ గా రాజా సాబ్ స్టార్ట్ చెయ్యకపోయేసరికి అందరిలో ఇలాంటి అనుమానాలే మొదలవుతాయి. అందుకే ముందు క్లారిటీ కాదు ప్రమోషన్స్ స్టార్ట్ చేయమంటున్నారు.
నిజమే ద రాజ్ సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ అయితే ఎలాంటి రూమర్స్ దరి చేరవు. లేదంటే కొంతమంది పనిగట్టుకుని రాజా సాబ్ పై విషం చిమ్ముతారు. రాజా సాబ్ రూమర్స్ కి క్లారిటీ కాదు ముందు ప్రమోషన్స్ మొదలెట్టండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు.




ఇలాగైతే కష్టం పాప 
Loading..