గ్లామర్ కి కేరాఫ్ సమంత. కొన్నాళ్లుగా గ్లామర్ షో కి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సమంత రెండేళ్లుగా నటనకు బ్రేకిచ్చి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. గ్లామర్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ హెల్త్ టిప్స్ చెబుతున్న సమంత ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణం ఆమెపై ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
ఇప్పుడు కూడా సమంత రాజ్ నిడమోరు తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. రాజ్ ఫ్యామిలీతో కలిసి ఫెస్టివల్ చేసుకుంది, తన సినిమాల్లో ప్రొడ్యూసర్ గా రాజ్ ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఆమె నిర్మించిన శుభం లోనే కాదు, ఇప్పుడు స్టార్ట్ చేసిన మా ఇంటి బంగారంలోను రాజ్ నిడమోరు సమంత పక్కనే ఉండడంపై మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి.
సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షూట్స్ షేర్ చేసే సమంత తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్ లో కనిపించింది. ఆ డ్రెస్ లో సమంత లుక్స్ బ్యూటిఫుల్ అనాల్సిందే. కాకపోతే సమంత మరీ సన్నగా కనిపించింది. జీరో సైజ్ మాదిరి కనిపించినప్పటికీ ఆమె లుక్ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీ నే.




క్లారిటీ కాదు - ప్రమోషన్స్ మొదలెట్టండి 

Loading..