అమ్మ చేతుల్లో నుంచి శ్రీలీల బయటికొస్తేనే ఆమెకు కేరీర్ ఉంటుంది. అమ్మ చెప్పింది అని సినిమా ఒప్పుకుంటే నిరాశ పరిచే ఫలితాలే వస్తాయి. ఎప్పుడు అమ్మవెంట తిరిగితే నీకు కెరీర్ లో ఎదుగుదల ఏముంటుంది. అమ్మ చెప్పింది, అమ్మ నా వెనుకే ఉంది అని కథల ఎంపిక లో నిర్లక్ష్యంగా ఉంటే కెరీర్ ఖతం అవుతుంది అంటూ శ్రీలీలను అభిమానులు హెచ్చరించడం హాట్ టాపిక్ అయ్యింది.
ధమాకా హిట్ తర్వాత గుంటూరు కారమైనా ఆదుకుంటుంది అనుకుంటే అది కూడా శ్రీలీల కు షాకిచ్చింది. కంటెంట్ లో బలం లేకపోతె ఎవ్వరూ ఏమి చెయ్యలేరు. కానీ శ్రీలీల నటించిన పాత్రలన్నీ రిచ్ గర్ల్ గా, హీరో తో ఆడిపాడడానికి తప్ప మరో ప్రాముఖ్యత వాటిల్లో కనిపించదు. ఏ సినిమాలోనూ ఆమెకు అసలు నటించే స్కోప్ కూడా దొరకలేదు.
నితిన్, రామ్, మహేష్ ఏ ఒక్కరూ శ్రీలీల ను ఆదుకోలేదు.. సరికదా వారికీ కోలుకోలేని దెబ్బలు తగిలాయి. మధ్యలో బాలయ్య భగవంత్ కేసరి నేషనల్ అవార్డు పట్టుకొచ్చినా.. శ్రీలీల కు పేరొచ్చినా అందులో ఆమె హీరోయిన్ కాదాయే. ఆ సినిమా క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలో పడింది. ఇక ఇప్పుడు ఆమె లేటెస్ట్ చిత్రం మాస్ జాతర చూసిన వారు శ్రీలీల మేలుకోకపోతే కష్టం. ఆమె కథలు ఎంపికలో శ్రద్ద పెట్టాలి. ఆచి తూచి అడుగెయ్యకపోతే దెబ్బకు కెరీర్ ఖతం అవుతుంది.
అవకాశాలు వస్తున్నాయని ఒప్పేసుకుంటే కాదు, కంటెంట్ లో బలం ఉండాలి, తన కేరెక్టర్ కి వెయిట్ ఉందా అనేది అలోచించి డెసిషన్ తీసుకుంటే కెరీర్ లో ఎదుగుతావ్, లేదంటే మూటాముల్లె సర్దుకోవాలంటూ ఆమెకు సలహాలు ఇచ్చేవారు ఎక్కువయ్యారు.




అనసూయ నిజంగా ఓ అద్భుతం 
Loading..