మాస్ మహారాజా రవితేజలో రియలైజేషన్ కనిపిస్తోందా? అందుకే అతడు తప్పు ఒప్పుకున్నాడా? అంటే అవుననే భావించాలి. చాలా మంది తెలుగు హీరోలు వరుసగా ప్రయోగాత్మక స్క్రిప్టులను ఎంపిక చేసుకుని పాన్ ఇండియాలో దూసుకుపోతుంటే, మాస్ మహారాజా మాత్రం రొటీన్ స్క్రిప్టులు, పరిచయస్తులైన దర్శకులకు కమిట్ మెంట్లు ఇవ్వడం ద్వారా కొన్ని వరుస పరాజయాలను అందుకోవాల్సి వచ్చింది. ఇది నిజంగా రవితేజను ఆలోచింపజేసిందని కూడా అర్థమవుతోంది.
ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్ .. ఇవన్నీ వరుసగా రవితేజ నటించిన సినిమాలు.. వీటిలో ఒక్కటి కూడా హిట్టు లేదు. కొన్ని వరుస పరాజయాలు అభిమానులకు నీరసం తెప్పించాయి. రెగ్యులర్ కథలు, రొటీన్ పాత్రలతో రవితేజ నిజంగానే విసుగు పుట్టించాడు. ఒక రకంగా అతడు నమ్మిన దర్శకులే అతడిని ముంచారు. రవితేజ తనకు బాగా పరిచయస్తులైన చాలా మంది అసిస్టెంట్లకు అవకాశాలు కల్పించి వారికి కెరీర్ ని ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇది మంచి విషయమే అయినా కానీ, సక్సెస్ ఆధారంగా నడిచే పరిశ్రమలో హిట్టు కొట్టడం కూడా అవసరం. కానీ దానిని రవితేజ భేఖాతరు చేసారు. కారణం ఏదైనా కానీ అతడిలో ఇప్పుడు రియలైజేషన్ కనిపిస్తోంది.
`మాస్ జాతర` ప్రీరిలీజ్ ఈవెంట్లో రవితేజ తన తప్పును బహిరంగంగా అంగీకరించారు. మిమ్మల్ని నా గత కొన్ని సినిమాలతో ఇబ్బంది పెట్టాను.. అంటూ తన అభిమానులనుద్ధేశించి మనస్ఫూర్తిగా అన్నారు. మాస్ జాతర సినిమాతో అలా జరగదని కూడా రవితేజ ఫ్యాన్స్ కు ప్రామిస్ చేసారు. గత పరాజయాలు ఫ్యాన్స్ ని విసిగించాయనే దానిని అతడు పూర్తిగా గ్రహించాడు.
థాంక్ గాడ్.. ఇప్పటికి అయినా మారిన ట్రెండ్ తో పాటు కథలు, స్క్రిప్టులు మారాలని రవితేజ గ్రహించినట్టే కనిపిస్తోంది. ఇతర పాన్ ఇండియా స్టార్లకు ధీటుగా అతడు తనను తాను నిరూపించుకోవాలంటే తనకు దగ్గరగా లేని దర్శకుల వద్దకు కూడా వెళ్లి కథలు వినాల్సి ఉంటుంది. ఇంకా పాత కాలపు స్లాప్ స్టిక్ కామెడీలు, రొటీన్ మాస్ స్టఫ్ వర్కవుట్ కాదని అతడు అర్థం చేసుకుంటేనే మంచిది. మారిన ట్రెండ్ లో వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ, సాంకేతికంగాను ట్రెండ్ ని అనుసరించగలిగితేనే ఈరోజుల్లో మనుగడ సాధ్యం. రవితేజ తన సన్నిహితులు లేదా తన చుట్టూ ఉన్న కోటరీ కారణంగా కొత్తగా ప్రయత్నించలేకపోతే దానికి ఇప్పుడే అతడు చెక్ పెడితే మంచిది.




 
                     
                      
                      
                     
                     విజయ్ కు షాకిచ్చిన అభిమాని ఫ్యామిలీ
 విజయ్ కు షాకిచ్చిన అభిమాని ఫ్యామిలీ 

 Loading..
 Loading..