కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ ర్యాలీ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కరూర్ తొక్కిసలాట ఘటన అందరిని కలిచి వేసింది. తన కోసం వచ్చి ఈ ఘటన లో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు రూ.20 లక్షల ఆర్ధికసహాయన్ని విజయ్ ప్రకటించారు. తనవంతుగా ఈ ఆర్ధిక సహాయం ఇవ్వడం జరిగింది, ఇది అనుకోకుండా జరిగిన ఘటన, తను చాలా బాధపడుతున్నట్టుగా విజయ్ ఈ ఘటన జరిగిన తర్వాత వీడియో వదిలారు.
అయితే తాజాగా కరూర్ ర్యాలీ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలను మహాబలిపురం రిసార్ట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఓదార్చడమే కాదు, బాధిత కుటుంబాలకు ఆయన తాను ప్రకటించిన రూ.20 లక్షల రూపాయల చెక్ ని అందించారు. తొక్కిసలాట జరిగిన కొద్ది రోజుల తర్వాత వీడియో కాల్ చేసి మాట్లాడిన విజయ్ నేరుగా వచ్చి బాధిత కుటుంబాలను ఓదారుస్తామని చెప్పారు.
కానీ విజయ్ ముందుగా బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించారు. అందులో ఓ బాధిత కుటుంబం విజయ్ ఇచ్చిన 20 లక్షల రూపాయలను వెనక్కి తిరిగి పంపించడం హాట్ టాపిక్ అయ్యింది. మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి విజయ్ ఇచ్చే డబ్బు మాకొద్దు, అయన మమ్మల్ని ఓదారుస్తామన్నారు, అందుకోసమే చూసాము, కానీ ఆయన మాట తప్పారు, మాకు ఆయన ఇచ్చే డబ్బు వద్దు అంటూ విజయ్ ఇచ్చిన చెక్ ని వెన్కక్కి ఇచ్చేసారు.




 
                     
                      
                      
                     
                     శారీ లో మృణాల్ బ్యూటిఫుల్ లుక్
 శారీ లో మృణాల్ బ్యూటిఫుల్ లుక్ 

 Loading..
 Loading..