సినిమా నిర్మాతలు ఓటీటీల కారణంగా ఇటీవల కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. థియేట్రికల్ బిజినెస్ ని దారుణంగా దెబ్బ కొట్టిన ఓటీటీలు ఇప్పుడు హక్కుల కొనుగోలు విషయంలోను నిర్మాతలను అదుపులో ఉంచడానికి ఎత్తుగడలను అనుసరిస్తున్నాయి.
ఇందులో ప్రధానంగా థియేట్రికల్ గా బాగా ఆడిన సినిమాకి మాత్రమే అధిక మొత్తాలు చెల్లించేలా కొత్త రూల్ ని తెచ్చాయి. థియేటర్లలో ఆడని సినిమాకి ఒప్పందం ప్రకారం చెల్లింపులు తగ్గిపోతాయి. ఈ నియమం నిజంగా నిర్మాతలకు పెనుసవాల్ గా మారుతోంది. ఇటీవల విడుదలైన ఓ యువహీరో సినిమా డిజాస్టర్ ఫలితాన్ని ఎదుర్కొంది. దీంతో ఓటీటీ హక్కులకు 50శాతం మాత్రమే చెల్లించారు. దీనిని బట్టి థియేట్రికల్ సక్సెస్ ప్రతిదీ డిసైడ్ చేస్తుంది. రంగుల ప్రపంచంలో కేవలం 5-10 శాతం మాత్రమే సక్సెస్ రేటు ఉంది. అంటే 10శాతం లోపు సినిమాలకు మాత్రమే ఆశించిన ధర పలుకుతుంది.
మిగతా 90శాతం సినిమాలు ఓటీటీల నుంచి ఆశించిన రెవెన్యూని ఆర్జించేందుకు ఆస్కారం లేదు. ఫ్లాపైంది అనే నెపంతో నిర్మాతలను సాధ్యమైనంత తగ్గించేందుకు కార్పొరెట్ ఎత్తుగడలు, వ్యూహం ప్రమాదకరంగా మారిందని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓటీటీలను తగ్గించేందుకు నిర్మాతలు ఐక్యంగా ఏం చేస్తారు? అన్నది సస్పెన్స్ గా మారింది.
శాటిలైట్ రైట్స్, అనువాద హక్కులకు కూడా డిమాండ్ తగ్గిపోవడం, ఇదే సమయంలో ఓటీటీలు కూడా కొత్త గేమ్ ప్లాన్ తో నిర్మాతలను కిందికి దించేయడం చూస్తుంటే, మునుముందు సినిమాలకు గడ్డుకలం దాపురించిందనే ఆందోళన నెలకొంది.




గ్యాంగ్‌స్టార్ డ్రామాలో జాక్‌పాట్

Loading..