భూమిక- భరత్ ఠాకూర్ జంట నిర్మించన తకిట తకిట చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు హర్షవర్ధన్ రాణే. మొదటి సినిమానే డిజాస్టర్ ఫలితం అందుకుంది. తొలి చిత్ర కథానాయకుడిగా అతడి ప్రభావం నిల్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో అవకాశాలు అందుకున్నా ఫలితం శూన్యం. అయితే సక్సెస్ దక్కలేదని నిరాశ చెందలేదు. అతడు తన ప్రయత్నాలను ఆపలేదు.
అతడు సరైన సమయంలో తెలివిగా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అక్కడ కూడా ఆశించిన అవకాశాల్లేవ్. పెద్ద హీరోల సినిమాల్లో రెండో హీరోగా నటించాడు. కానీ ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే! అతడికి కూడా ఒక అవకాశం వచ్చింది. సనమ్ తేరి కసమ్ అతడి కెరీర్ లో ఊహించనంత పెద్ద హిట్టు. అది కూడా రీరిలీజ్ లో సంచలన వసూళ్లను సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. దీనికి మించి ఒక నటుడిగా హర్షవర్ధన్ స్థాయిని ఈ చిత్రం ఎలివేట్ చేసింది. ఆ తర్వాత ఏక్ దీవానా థా దీవానియత్ చిత్రంతో మరోసారి నటుడిగా తన స్టామినా ఏంటో చూపించాడు హర్ష.
అందుకే ఇప్పుడు అతడిని గ్యాంగ్ స్టర్ డ్రామాలో నటించే అవకాశం వరించింది. ప్రఖ్యాత నిర్మాత ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక యువకుడు పరిస్థితుల కారణంగా అండర్ వరల్డ్ లో ప్రవేశించాక ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ సినిమా కథాంశం. ఇందులో అతడు డాన్ పాత్రలో నటించనున్నాడు. హర్షకు ఇది అరుదైన అవకాశం. నటుడిగా తన పరిధిని విస్తరించుకునేందుకు ఇది సరైన ఛాన్స్ అని భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.




మత్తు కొందరికి జీన్స్లో ఉంటుంది: బాబి

Loading..