`ఆశ్రమ్` వెబ్ సిరీస్‌లో అద్భుత నట ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు బాబి డియోల్. యానిమల్ లో అబ్రార్ పాత్రతో లక్షలాదిగా ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ నటుడు ఇటీవల ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్`లో కనిపించాడు. మరోసారి భారీ ప్రశంసలు పొందాడు. బాబీ పరిశ్రమలో మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, వ్యక్తిగత వృద్ధి, నిగ్రహం, తన జీవితంలో కొత్తగా కనుగొన్న సమతుల్యత గురించి ఓపెనయ్యాడు.
తన సంబంధాలు మెరుగవ్వడానికి అలవాట్లలో వచ్చిన మార్పు బాగా పని చేసిందని అంగీకరించాడు. బాబీ తాను మద్యాన్ని పూర్తిగా మానేశానని, అది తన జీవితాన్ని మంచిగా మార్చిందని తెలిపాడు. ఈ పని నాకు నిజంగా సహాయపడింది. ప్రతి ఒక్కరూ జన్యుపరంగా భిన్నంగా ఉంటారు. ఏ రకమైన మత్తు అయినా మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో గ్రహించరు.. కొందరికి బానిసయ్యే జన్యువులు ఉంటాయి అని వివరించారు. నేను తాగడం మానేసిన తర్వాత మంచి వ్యక్తినయ్యానని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ప్రతి ఒక్కరితో నా సంబంధం వంద రెట్లు మెరుగైందని నేను భావిస్తున్నాను.. ఇది వ్యక్తిగత నిర్ణయం అని తెలిపారు.
ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ లో తనను దర్శకత్వం వహించిన ఆర్యన్ ఖాన్ ను కూడా బాబీ ప్రశంసించాడు. ఆర్యన్ ప్రతిభావంతుడైన, క్రమశిక్షణ కలిగిన ఫిలింమేకర్.. తనను తాను ప్రపంచానికి నిరూపించాడు అని ప్రశంసించాడు. ఒక సూపర్ స్టార్ వారసుడు అనే నీడ తనపై పడకుండా తనను తాను పరిశ్రమలో నిరూపించుకునేందుకు ఆర్యన్ చూపించిన ధైర్యాన్ని ప్రశంసించాడు. ఎంత ఒత్తిడి ఉన్నా దర్శకుడిగా తన శైలిని ప్రదర్శించేందుకు చూపించిన ధైర్యానికి హ్యాట్సాఫ్ అని అన్నారు.
యానిమల్, ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ తర్వాత `యానిమల్ పార్క్`లో నటించాల్సి ఉంది. స్పిరిట్ తర్వాత సందీప్ వంగా `యానిమల్ 2`ని పట్టాలెక్కించే వీలుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో బాబి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఊహించనిది ఏదైనా జరిగితే అదే జీవితం అని అతడి విషయంలోను నిరూపణ అయింది.




రూమర్స్ కి బలాన్నిస్తున్న సమంత 

Loading..