సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా `దబాంగ్` చిత్రాన్ని తెరకెక్కించాడు అభినవ్ కశ్యప్. కానీ ఎక్కడ చెడిందో కానీ, సల్మాన్ అతడి కుటుంబానికి మానసికంగా దూరం అయ్యాడు. తన సృజనాత్మకతకు సల్మాన్ భంగం కలిగించాడని, తనను నియంత్రించాడని అతడు బలంగా ఆరోపిస్తున్నాడు. తన కెరీర్ ఎదుగుదలను నియంత్రించాడని కూడా ఆందోళన వ్యక్తం చేసాడు. అతడి కుటుంబం తనను నీడలా వెంటాడి నాశనం చేసిందనే బాధను వ్యక్తం చేసాడు.
అతడు సల్మాన్ పై కక్ష పూరితమైన విమర్శలు చేసాడు. సల్మాన్ కి అసలు నటించడమే రాదని అన్నాడు. అతడు మాఫియాలా ప్రవర్తిస్తాడని విమర్శించాడు. క్రమశిక్షణ అన్నదే లేని నటుడు అని దూషించాడు. అయితే అతడు కేవలం సల్మాన్ ని మాత్రమే టార్గెట్ చేయలేదు. సల్మాన్ కి అత్యంత సన్నిహితులు అయిన షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లను కూడా తీవ్రంగా విమర్శించాడు. కటువైన పదజాలంతో దారుణంగా తిట్టాడు. అమీర్ ఖాన్ ని మరుగుజ్జులో ఏం ఉందని అందరూ వెళ్లి కలుస్తున్నారు? అంటూ రాజ్ కుమార్ హిరాణీ లాంటి పెద్ద దర్శకుడిని ప్రశ్నించాడు.
అమీర్ ఖాన్ కి కూడా నటించడం రాదని అతడు నోరు పారేసుకున్నాడు. ఒక మరుగుజ్జును, నటించడం రానివాడిని మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని ఎలా పిలుస్తారు? అని కూడా ఎదురు ప్రశ్నించాడు. దంగల్ కథకు స్ఫూర్తినిచ్చిన క్రీడాకారణులు ఫోగత్ సిస్టర్స్ ఒక అకాడెమీని ప్రారంభించేందుకు సహకరించాలని కోరితే అమీర్ ఖాన్ ఎలాంటి సహాయం చేయలేదని అన్నాడు. హిరాణీ, రాజ్ కుమార్ సంతోషి లాంటి దర్శకులు అమీర్ ఖాన్ ని ఇంటికి వెళ్లి ఎందుకు కలుస్తారో అర్థం కావడం లేదని, వారంతా ట్రాప్ లో ఉన్నారని, సొంత బ్యానర్లలో సినిమాలు నిర్మించి ఇతర నటులకు అవకాశాలివ్వాలని కూడా సూచించాడు అభినవ్ కశ్యప్.
కింగ్ ఖాన్ షారూఖ్ ని కూడా అతడు వదిలిపెట్టలేదు. షారూఖ్ వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నాడు. అతడు స్టార్ డమ్ ని సెట్ చేసి ఇతరులను లోబరుచుకుంటాడని విమర్శించాడు. ఖాన్ ల త్రయాన్ని దారుణంగా తిట్టేందుకు అతడు వెనకాడలేదు. వ్యక్తిగతంగా దూషిస్తూ దారుణ పదజాలాన్ని ఉపయోగించాడు. అతడు తన హుందాతనాన్ని కోల్పోయి, గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడాడు. వారిని అవమానించాడు. అయితే ఖాన్ లు ఇప్పటివరకూ అభినవ్ ని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదు. సల్మాన్ ఖాన్ తన బిగ్ బాస్ షోలో పేరు చెప్పకుండా కొన్ని సెటైర్లు వేసారు తప్ప అతడిని నేరుగా ఏదీ అనలేదు. అతడు పాడ్ కాస్ట్ లలో మాట్లాడుతూ ఖాన్ ల త్రయాన్ని దారుణంగా తిడుతుంటే అభిమానులు మరిగిపోతున్నారు. కానీ ఖాన్ లు మాత్రం స్పందించేందుకు కూడా ఇష్టపడటం లేదు.




ఓటీటీల మెడ వొంచేది ఎలా

Loading..