హిందీ చిత్ర పరిశ్రమలో విజయవంతంగా 25 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు హృతిక్ రోషన్. గ్రీక్ గాడ్ గా అభిమానుల గుండెల్లో నిలిచి ఉన్నాడు. బాలీవుడ్‌లోని ప్రతి ఒక్కరూ అత్యంత విజయవంతమైన డెబ్యూ నటుడిగా హృతిక్ ని కీర్తించారు. అతడు నటించిన మొదటి మూవీ `కహో నా ప్యార్ హై` ఇప్పటికీ యూత్ కి ఫేవరెట్. ఇది 2000 సంవత్సరంలో అతిపెద్ద హిట్ మాత్రమే కాదు.. అభిమానులు ఆ రొమాంటిక్ బ్లాక్‌బస్టర్‌లోని ఐకానిక్ డ్యాన్స్ స్టెప్‌లను గుర్తుంచుకుంటారు. ది గ్రేట్ రోషన్ ఇప్పుడు `క్రిష్ 4`తో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు.
హృతిక్ రోషన్ ఇటీవల హాలీవుడ్ లెజెండ్ జాకీ చాన్‌ను కలిశారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మార్షల్ ఆర్ట్స్ ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచే గ్రేట్ పర్సనాలిటీ జాకీ చాన్ పై తన అభిమానాన్ని హృతిక్ ఎంత మాత్రం దాచుకోలేదు. అతడితో కలిసి ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీనికి అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ``మీ విరిగిన ఎముకలను నా విరిగిన ఎముకలు పలకరిస్తాయి``ని వ్యాఖ్యానిస్తూ జాకీ చాన్ అంకితభావాన్ని కొనియాడాడు.
అయితే జాకీ చాన్ ని హృతిక్ కలుసుకోవడం ఇదే మొదటిసారి కాదు. హృతిక్ తన సినిమా `కాబిల్` చైనా రిలీజ్ సమయంలో నాలుగేళ్ల క్రితం జాకీ చాన్ ని కలిసాడు. అప్పటి నుంచి ఆ ఇద్దరూ ఒకరికొకరు టచ్ లో ఉన్నారు. ఇప్పుడు మరోసారి హృతిక్ కి జాకీ చాన్ తో కలిసే అవకాశం లభించింది. ఈసారి అభిమానిగా కొన్ని స్నాప్ లు దిగాడు. ప్రస్తుతం ఇవి అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. మోస్ట్ అవైటెడ్ `క్రిష్ 4`కి దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్న హృతిక్ రోషన్ దానికోసం చాలా కసరత్తు చేస్తున్నాడు. యష్‌రాజ్ ఫిలింస్‌తో కలిసి రాకేష్ రోషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




                     
                      
                      
                     
                    
 బిగ్ బాస్ 9: రీతూ-మాధురి ఏమిటా అరుపులు 

 Loading..