బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం నామినేషన్స్ హీట్ మాములుగా లేదు. ఈ సీజన్ మాజీ కంటెస్టెంట్స్ అంటే ఎలిమినేట్ అయిపోయిన ప్రియా, మనీష్, శ్రీజ, ఫ్లోరా షైనీ లు హౌస్ లోకి వచ్చి హౌస్ మేట్స్ ముసుగు తీసే ప్రయత్నమైతే చేసారు. ఈ ప్రక్రియలో హౌస్ మేట్స్ నడుమ చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది.
ఇక శ్రీజ ఎలిమినేషన్ కి కారణమైన మాధురి కి పవర్ ఇచ్చి మీరు బాండింగ్స్ లేకుండా ఎలా నామినేట్ చేస్తారో చూస్తా అంటూ శ్రీజ మాధురిని రెచ్చగొట్టింది. దానితో మాధురి రీతూ నువ్వు పవన్ ని కెప్టెన్ ని చేసేందుకు మమ్మల్ని వాడుకున్నావ్, కళ్యాణ్ ముందునుంచి చెప్పాడు ఆమెను నమ్మొద్దు అని అంటే రీతూ నేను కంటెండర్ అయ్యాకే పవన్ కి డబ్బులు ఇచ్చాను అంది.
ఈలోపు శ్రీజ మీరు తనూజ డబ్బులు గురించి ఏం మట్లాడుకున్నారు అనగానే మాధురి నువ్వు ఆగవమ్మా అంటూ శ్రీజ పై ఫైర్ అయ్యింది. ఇక రీతూ కూడా మీరు తనూజ బాండింగ్ పెట్టుకోలేదా, మీరు మీరు బాండింగ్స్ లో లేరా అనగానే నీది పవన్ ది బాండింగ్ నాకు నచ్ఛలేదు అంటూ మాధురి-రీతూ లు కొట్టేసుకుంటారా అన్నట్టుగా మీద మీదకి వెళ్లి అరుచుకున్న ప్రోమో వైరల్ అయ్యింది.




                     
                      
                      
                     
                    
 రూ.800 కోట్ల మూవీ అప్పుడే ఓటీటీలోకా.. 

 Loading..