అక్టోబర్ 2 న పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ కాంతార చాప్టర్ 1 సౌత్ నుంచి నార్త్ వరకు అందరికి నచ్చేసింది. సినిమా విడుదలై నెల తిరగకుండానే కాంతార చాప్టర్ 1 రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొడుతూ రూ.800 కోట్ల క్లబ్బులోకి వెళ్ళిపోయింది. రిషబ్ శెట్టి యాక్టింగ్, దర్శకత్వమే కాదు, సినిమాటోగ్రఫీ, రుక్మిణి వసంత్ లుక్ అందరికి బాగా నచ్చేసాయి.
సౌత్ లోని మొత్తం భాషల్లో కాంతార ఎంత నచ్చిందో ఆ చిత్రానికి వచ్చిన ఫిగర్ చూస్తే అర్ధమవుతుంది. థియేటర్స్ లో ఇంకా కలెక్షన్స్ రాబడుతున్న కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ పై ఇప్పుడొక న్యూస్ చక్కర్లు కొడుతోంది. అది చూసిన వారు.. కాంతార థియేటర్స్ లో విడుదలై నెల అవ్వలేదు, ఈ హిట్ మూవీ అప్పుడే ఓటీటీలోకా అంటూ మాట్లాడుకుంటున్నారు.
కాంతార ఛాప్టర్ 1 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. కాంతార డీల్ రూ.125 కోట్లు చెల్లించినట్లు సమచారం. అయితే ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం అక్టోబర్ 30న లేదా నవంబర్ మొదటి వారంలో కాంతారా ఛాప్టర్ 1 సినిమా ఓటీటీలోకి తీసుకురావాలని అమెజాన్ ప్రైమ్ చూస్తుందట. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది అంటున్నారు.




                     
                      
                      
                     
                    
 BB 9-నామినేషన్స్ లో అల్లాడిస్తున్న మాజీలు

 Loading..