ఈవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియను గత కొన్ని వారాలుగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి అంటే మాజీ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నవారిని నామినేట్ చెయ్యాలి. అలా ప్రియా, మనీష్, ఫ్లోరా షైనీ, శ్రీజ హౌస్ లోకి వచ్చారు. కామనర్స్ లో ఫ్రెండ్లి గా ఉన్న శ్రీజ, కళ్యాణ్ లు ఇప్పుడు ఈ నామినేషన్స్ లో గొడవపడ్డారు. కళ్యాణ్ కి కత్తి గుచ్చి శ్రీజ నామినేట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
వైల్డ్ కార్డులు వచ్చి నువ్వు అమ్మాయిల పిచ్చోడివి అంటే ఎందుకు డిపెండ్ చేసుకోలేకపోయావ్ అని శ్రీజ అంటే ఆవిడ సారీ చెప్పింది అందుకే నేనేమి మాట్లాడలేదు అన్నాడు కళ్యాణ్, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి సారీ అంటే ఒప్పేసుకుంటావా, తనూజ ను నామినేట్ చేస్తాను అని ఎందుకు చెయ్యలేదు అంటే.. కాపీ క్యాట్ నామినేషన్ వెయ్యను అనడు. కాదు నువ్వు నెగెటివ్ అవుతుంది అని భయపడ్డావ్ అంటూ శ్రీజ కళ్యాణ్ పై ఫైర్ అయ్యింది.
ఇక సుమన్ శెట్టి తనను సంజన తొక్కలో కెప్టెన్ అన్నందుకు నామినేట్ చెయ్యగా.. సారీ చెప్పాను కదన్నా అంది సంజన, చెంప మీద లాగిపెట్టి కొట్టి సారీ చెప్పేస్తే సరిపోతుందా సిస్టర్, మిమ్మల్ని మేము కెప్టెన్ గా ఎంత గౌరవించాము అన్నాడు. ఇక ఫ్లోరా రీతూ ని నువ్వు కళ్యాణ్ లేదంటే డిమోన్ లతో లవ్ ట్రాక్ వేసుకున్నావ్, నువ్వు ఫేక్ అంది, నేనేమి అలా చెయ్యలేదు మీరనుకుంటే నాకేం ప్రాబ్లెమ్ లేదు అంది రీతూ.
తనూజ కోసం కళ్యాణ్ ఏడుస్తుంటే నువ్వు నవ్వావ్ అంటూ ఫ్లోరా రీతూ ని నామినేట్ చేసింది. మరి మాజీ కంటెస్టెంట్స్ మాంచి ఫైర్ మీదుండి హౌస్ మేట్స్ ని నామినేషన్స్ లో బాగానే టార్గెట్ చేసారు.




జైలర్ 2 స్టోరీ రివీల్డ్ 

Loading..