నిర్మాత నాగవంశీ సినిమాలని అనుకున్న సమయానికి విడుదల చెయ్యకుండా ఆలస్యం చేస్తూ ఉంటారంటారు. కానీ ఆయన నుంచి ఏ అప్ డేట్ అయినా అనుకున్న సమయానికి రాదు అనేది మరోసారి నిరూపితమైంది. మాస్ జాతర సినిమా పదే పదే పోస్ట్ పోన్ అవ్వడమే కాదు ఇప్పుడు ట్రైలర్ విడుదల అనుకున్న సమయానికి జరగలేదు.
ఐదు రోజుల్లో సినిమా విడుదల. ఇప్పుడు ట్రైలర్ అన్నారు. అదయినా సక్రమంగా ఇచ్చారా.. లేదు. రెండు రోజులుగా మాస్ జాతర ట్రైలర్ పై క్రేజ్ పెంచిన మేకర్స్ ఈ రోజు సాయంత్రం 7.03 నిమిషాలకు మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ అని డబ్బా కొట్టి టైమ్ 8 దాటినా ఇప్పటివరకు ట్రైలర్ రిలీజ్ చెయ్యలేదు.
దానితో నిర్మాత నాగవంశీపై రవితేజ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. మాట తప్పుడు - మడం తిప్పడు అని అనుకుంటున్నారేమో, ఆ రెండు తప్పేవాడే మా నాగవంశీ, మీ ట్రైలర్ ని మీ చూసుకోండి, మళ్లి మళ్లీ మాట తప్పారు నాగవంశీ, మాస్ జాతర సినిమానే కాదు ట్రైలర్ ను కూడా అనుకున్న సమయానికి ఇవ్వలేకపోయారంటూ కామెడీగా నాగవంశీపై సెటైర్స్ వేస్తున్నారు.




జాకీచాన్‌తో ఫ్యాన్ బోయ్ మూవ్మెంట్

Loading..