సోషల్ మీడియాలో ఏ హీరోయిన్ లేనంత యాక్టీవ్ గా రకుల్ ప్రీత్ ఉంటుంది. గ్లామర్ షో చేసినా, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసినా, లేదంటే భర్తతో వెకేషన్ కి వెళ్లినా ఏదైనా సరే ముందుగా సోషల్ మీడియాలో షేర్ చెయ్యాల్సిందే. అంతేకాదు గ్లామర్ షో విషయంలో రకుల్ ని తలదన్నే వారే లేరంటే నమ్మాలి.
పూర్తిగా సౌత్ కి దూరమైన రకుల్ ప్రీత్ బాలీవుడ్ హీరోయిన్స్ లా అందాలు ఆరబోసే పనే పెట్టుకుంది. సోషల్ మీడియాలో ఎంతగా అందాలు చూపించే ఫొటోస్ షేర్ చేసినా ఒక్క సౌత్ ఆఫర్ కూడా రకుల్ చెంతకు చేరడమే లేదు. ఇండియన్ 2 తర్వాత రకుల్ ని సౌత్ దర్శకనిర్మాతలు లైట్ తీసుకుంటున్నారు.
సౌత్ ఆడియన్స్ రకుల్ ని ఆల్మోస్ట్ మర్చిపోయారు. సోషల్ మీడియా లుక్స్ తో ఆఫర్ వస్తే సౌత్ లో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇవ్వాలని రకుల్ వెయిట్ చేస్తుంది. కానీ ఫలితం కనిపించడం లేదు. ఎంతగా గ్లామర్ షో చేసినా పాప కు వర్కౌట్ అవ్వడం లేదు.




హల్దీ వేడుకల్లో నారా రోహిత్-శిరీష

Loading..