ఈ నెల 30 న హీరో నారా రోహిత్-శిరీష ల వివాహం హైదరాబాద్ లో అతిరథమహారధుల నడుమ అంగరంగ వైభవంగా జరపతలపెట్టింది నారా ఫ్యామిలీ. అక్టోబర్ 30 న జరగబోయే పెళ్లి వేడుకల కన్నా ముందే ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో నారా రోహిత్ -శిరీష లతో పాటుగా ఫ్యామిలీ మెంబెర్స్ పాల్గొంటున్నారు. నిన్న శనివారమే నారా రోహిత్ పెళ్లి వేడుకలు మొదలైపోయాయి.
శనివారం నారా రోహిత్-శిరీష్ హల్దీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. పసుపు బట్టలలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మెరిసిపోయారు. నారా భువనేశ్వరి దగ్గరుండి ఈకార్యక్రమాన్ని జరిపించారు. ప్రస్తుతం నారా రోహిత్-శిరీష్ ల హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి
ఆదివారం అంటే ఈరోజు నారా రోహిత్ పెళ్లి కొడుకు, శిరీష్ పెళ్లి కూతురు ఫంక్షన్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 28న అంటే రేపు సోమవారం మెహందీ, అక్టోబర్ 29న సంగీత్ నైట్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు నారా రోహిత్- శిరీషలు పెళ్లి పీటలెక్కనున్నారు.
హైదరాబాద్ లో జరిగే ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.




మలయాళ మిరాజ్ మినీ రివ్యూ 

Loading..