కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమా రిలీజ్ తేదీల తలరాత ఓటీటీ చేతుల్లో అంటూ సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. చాలావరకు ఓటీటీ డీలింగ్స్ అయ్యాక అవి చెప్పే తేదీల్లోనే పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా రిలీజ్ తేదీలను నిర్మాతలు ప్రకటిస్తున్నారనే వార్తలు చూస్తున్నాము, అదే సగటు ప్రేక్షకుడు కూడా అనుకుంటున్నాడు.
తాజాగా సినిమా రిలీజ్ తేదీలు ఓటీటీలే నిర్ణయిస్తున్నాయి అనే మాటపై నిర్మాత నాగవంశీ మాస్ జాతర ప్రమోషన్స్ లో స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఏదైనా సినిమాల డిజిటల్ హక్కులు పొందిన ఓటీటీ సంస్థలు మేము రిలీజ్ తేదీ చెబితే దానితో పాటుగా కుదిరితే మరో తేదీ కూడా చెప్పమని అడుగుతాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఓటీటీ లలో రిలీజ్ చేసే సినిమాలు క్లాష్ కాకుండా చూసుకోవడానికి.
మేము రెండు పెద్ద సినిమాల మద్యన పోటీ లేకుండా ఎలా అయితే చూస్తామో.. ఓటీటీ సంస్థలు కూడా అంతే. అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ చెయ్యాలో మేమె డెసిషన్ తీసుకుంటాం తప్ప ఓటీటీ సంస్థలు నిర్ణయించవు, ఓటీటీ లే సినిమా రిలీజ్ తేదీలు నిర్ణయిస్తాయి అనేది అపోహ మాత్రమే అంటూ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.




అందాలు చూపించినా వర్కౌట్ అవ్వట్లే 

Loading..