కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఏం చేసినా అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అతడు ఇటీవలి కాలంలో తెరకెక్కించిన గంగూభాయి కథియావాడీ, హీరా మండి (వెబ్ సిరీస్) వంటి కళాత్మక చిత్రాలు ప్రజల మనసుల్ని గెలుచుకున్నాయి. ఇప్పుడు రణబీర్, ఆలియా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో లవ్ అండ్ వార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లవ్ ఎమోషన్స్, వార్ నేపథ్యంలో రక్తి కట్టించే చిత్రమిది.
అయితే ఈ సినిమా కోసం భారీ వార్ దృశ్యాలను చిత్రీకరించాల్సి ఉండగా, ముంబై లోని ఒక స్టూడియోలో ఇటలీ నగరాన్ని సెట్లలో నిర్మించారని తెలిసింది. దీనికోసం కోట్లాది రూపాయల్ని భన్సాలీ టీమ్ ఖర్చు చేసింది. ఈ సెట్లలో వార్ సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి ఉందని కూడా తెలిసింది. నిజానికి ఇటీలీకి వెళ్లి అక్కడే షూట్ చేయాలని భావించిన భన్సాలీ అనుకోకుండా షూట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. అంతర్జాతీయ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసాడు.
తక్కువ సమయం ఉండటం, లాజిస్టిక్స్ సమస్య కారణంగా ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీపావళికి ముందే పది రోజుల పాటు ఇటలీ సెట్లలో షూట్ చేసారు. ఇంకా షూటింగ్ కొనసాగుతోంది. 70ల నాటి ఇటలీ వాతావరణాన్ని సెట్లలోకి తీసుకొచ్చారని తెలిసింది. 45 రోజుల షెడ్యూల్ చేయాల్సి ఉండగా పది రోజులు పూర్తయింది.. ఇంకా 35 రోజుల పాటు ఇదే సెట్లో షూటింగ్ చేసేందుకు అవకాశం ఉంది.
ముంబై గోరేగావ్‌లోని రాయల్ పామ్స్ సమీపంలోని కాస్ట్ లీ స్టూడియోలో ఇటలీ నగరం సెట్లను నిర్మించినట్టు తెలిసింది. ఇందులో ఇటాలియన్ క్లబ్ హైలైట్ గా నిలవనుంది. ఈ సెట్ల నిర్మాణం కోసం భన్సాలీ ఏకంగా 30-40 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిసింది.




మాస్ జాతర పోస్ట్ పోన్ డేట్స్ కామెడీ 

Loading..