రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ చిత్రం ఎన్నో రిలీజ్ డేట్స్ ఇచ్చుకుంటూ వివిధకారణాలతో పోస్ట్ పోన్ చేసుకుంటూ ఫైనల్ గా అక్టోబర్ 31 న విడుదల అంటూ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఆ డేట్ కూడా మారడంతో మాస్ జాతర రిలీజ్ డేట్స్ పదే పదే మారడంతో ఇప్పుడు కామెడీగా నెటిజెన్స్ మాస్ జాతర రిలీజ్ డేట్స్ పై కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి మాస్ జాతర రిలీజ్ అన్నారు, అప్పుడు పోస్ట్ పోన్ అయిన మాస్ జాతర మే 9 కి షిఫ్ట్ అయ్యింది. ఆతర్వాత టెక్నీకల్ కారణాలంటూ మాస్ జాతర ఆగష్టు 27 వినాయక చవితి కి రిలీజ్ అంటూ ప్రమోషన్స్ జాతర మొదలు పెట్టి అప్పుడు రీ షూట్, సాంగ్ షూట్ అంటూ మళ్లీ పోస్ట్ పోన్ చేసారు.
అక్టోబర్ 31 అంటూ రిలీజ్ డేట్ లాక్ చేసి రవితేజ ఎప్పుడు లేని విధంగా ఇంటర్వూస్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అక్టోబర్ 31 నుంచి జస్ట్ వన్ డే పోస్ట్ పోన్ చేసారు. అక్టోబర్ 31 న రాజమౌళి బాహుబలి ద ఎపిక్ రిలీజ్ అవుతుంది. అందుకే మాస్ జాతర ను పోస్ట్ పోన్ చేసి నవంబర్ 1 న విడుదల చెయ్యబోతున్నారు.
అయితే మాస్ జాతర అక్టోబర్ 31 న విడుదల ఆపినా.. ఆ రోజు మాస్ జాతర పెయిడ్ ప్రీమియర్స్ వెయ్యబోతున్నారు.




BB9 - ఊహించని కంటెస్టెంట్ అవుట్ 

Loading..