బిగ్ బాస్ సీజన్ 9 50 రోజులు పూర్తి చేసుకుంది. రమ్య మోక్ష వచ్చి రెండు వారాలే కానీ హౌస్ 50 డేస్ పూర్తి చేసుకుంది అంటూ నాగార్జున శనివారం ఎపిసోడ్ లో చెప్పారు. అంటే అక్కడే రమ్య మోక్ష ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతుంది అని నాగ్ హింట్ ఇచ్చినట్టే కనిపించింది. కానీ ఈ వారం వోటింగ్ లో రమ్య, రాము రాధోడ్, సాయి లు దగ్గర దగ్గరగా ఒకే లెక్కలో ఓట్లు సొంతం చేసుకున్నారు.
సో ఈ ముగ్గురి లో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అనుకున్నా.. రమ్య ను అప్పుడే పంపించరు అనుకున్నారు. కానీ ఊహించనైనను లేదు రమ్య మోక్ష ని ఈ వారం ఎలిమినేట్ చేసి ఇంటికి వెళ్ళగొడతారని. పచ్చళ్ళ పాప మాంచి ఫైర్ తో హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది.. ఓ వారం ఫుల్ గా ఫుడ్ లాగించేసింది. తనూజ్-కళ్యాణ్ పై బ్యాక్ బిచ్చింగ్ చేసింది.
కళ్యాణ్ దగ్గరకు వెళ్లి మట్లాడడం, తనూజ ను నామినేషన్స్ లో నీచంగా టార్గెట్ చెయ్యడం.. రీతూ, పవన్ మధ్యలో చిచ్చు పెట్టడం.. తాను బంధాలు పెట్టుకోను అన్న రమ్య మోక్ష తనకు ఫ్రెండ్ అనుకున్న మాధురి దూరమైపోవడం, ఆమె తనూజ కు దగ్గరవడం తట్టుకోలేకపోయింది. ఇవన్నీ బుల్లితెర ప్రేక్షకులకు నచ్ఛలేదు. అందులోను అయేషా సాయి వాళ్లతో రమ్య హౌస్ లోకి రావడం రావడమే తనూజ ను ఎలిమినేట్ అయ్యేవరకు ప్రతి వారం నామినేట్ చేస్తాను అని చెప్పిన వీడియో కూడా చూపించారు.
అందుకే రమ్య మోక్ష కు బిగ్ బాస్ ఆడియన్స్ షాకిచ్చారు. నామినేషన్స్ లోకి వచ్చిన వెంటనే ఇంటికి పంపించేశారు. అందం మాత్రమే కాదు అణుకువ కూడా ముఖ్యమే, అందులోను నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇలానే ఉంటుంది అంటూ రమ్య ఎలిమినేషన్ పై నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.




క్యూట్ అండ్ స్వీట్ లుక్ లో NTR డ్రాగన్ భామ 

Loading..