Advertisementt

మెగాస్టార్ ని కలిసిన TFJA న్యూ కమిటీ

Sat 25th Oct 2025 09:40 PM
chiranjeevi  మెగాస్టార్ ని కలిసిన TFJA న్యూ కమిటీ
TFJA New Committee meets Megastar మెగాస్టార్ ని కలిసిన TFJA న్యూ కమిటీ
Advertisement
Ads by CJ

ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి టీఎఫ్ జేఏ కమిటీ మెంబర్స్ వివరించారు. 

భవిష్యత్ లో హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చిరంజీవి గారికి తెలిపారు. ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు సభ్యుల ఉన్నతికి కృషి చేస్తామని చిరంజీవి గారికి వివరించారు.

సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఎఫ్ జేఏ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశంసించారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి ఎప్పుడూ తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి గారు అభయం ఇచ్చారు. మెగాస్టార్ ను కలిసిన వారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వైజే రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, కోశాధికారి సురేంద్ర కుమార్ నాయుడు, ఇతర కమిటీ మెంబర్స్ ఉన్నారు.

TFJA New Committee meets Megastar:

TFJA New Committee meets Megastar Chiranjeevi

Tags:   CHIRANJEEVI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ