బాలకృష్ణ ఏపీ అసెంబ్లీ లో జగన్ ను సైకో అంటూ.. మెగాస్టార్ చిరు విషయంలో చేసిన కామెంట్స్ పై చిరంజీవి ప్రెస్ నోట్ వదిలారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆ సైకో కామెంట్స్ పై ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. తాజాగా జగన్ బాలయ్య విషయంపై ఘాటుగా కాదు కాదు సెటేరికల్ గా స్పందించారు.
తాగేసి వచ్చిన బాలయ్య ని అసెంబ్లీ కి ఎలా అనుమతిస్తారు, అతనికి మతి స్థిమితం లేదు, పని పాటా లేని సంభాషణ ని బాలకృష్ణ అసెంబ్లీ లోకి తీసుకొచ్చాడు. ఆయన మాట్లాడాల్సినవి ఏంటి, అసలు ఆయన తాగి మాట్లాడడం ఏమిటి. తాగినోడిని అసెంబ్లీ కి అనుమతివ్వడం, అతనితో మాట్లాడించే కార్యక్రమం చేసినందుకు ముందు స్పీకర్ కి బుద్ధి లేదు.
తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆయన్ని ఆయనే ప్రశ్నించుకోవాలి అంటూ జగన్ బాలయ్య పై ఫైర్ అవుతూ మాట్లాడిన మాటలకు నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




బిగ్ బాస్ 9 - సుమన్ శెట్టి తో సంజన గొడవ 

Loading..