బిగ్ బాస్ సీజన్ 9లో సెలెబ్రిటీ కోటాలో అడుగుపెట్టిన సంజన గల్రాని మొదట్లో కంటెంట్ కోసం దొంగతనాలు చేసింది. కోడిగుడ్లు తినేసింది ఇతరుల వస్తువులు దాచేసేది. నాగార్జున రెండుమూడుసార్లు వార్న్ చేసి చేసి చివరికి దొంగలున్నారు జాగ్రత్త బోర్డు మెడలో వేసాక సంజన దారిలోకొచ్చింది.
ఈవారం కళ్యాణ్ ఆమెని నామినేట్ చెయ్యడంతో కళ్యాణ్ తో ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడింది. తనూజ కోసం నన్ను ట్రాప్ చేసి నామినేట్ చేసావు. తనూజ నిఖిల్ వాళ్లతో క్లోజ్ అవుతుంది. ఆమె అటెన్షన్ కోసమే నన్ను నామినేట్ చేసావ్, అంటూ కళ్యాణ్ ప్రొఫెషన్ ను బయటికి లాగి మరీ అవమానించింది. ఆతర్వాత తనూజా తనని సంజన అనవసరంగా మాటలనడం పై ఫైర్ అయ్యింది. ఇమ్మాన్యువల్ అమ్మ అంటున్నాడు కాబట్టే నేను హౌస్ లో ఉన్నాను అంటూ ఎమోషనల్ డ్రామా ప్లే చేసింది సంజన.
ఇక ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది హౌస్ లో. ఈరోజు ఎపిసోడ్ లో సంజన డస్ట్ బిన్ విషయంలో కెప్టెన్ సుమన్ శెట్టి దగ్గర పంచాయితీ పెట్టింది. నాలుగు రోజులైనా డస్ట్ బిన్ తియ్యలేదు అంటూ దానిని బెడ్ రూమ్ లో పెట్టింది. దానితో మీరెందుకు ఆ వాష్ రూమ్ యూస్ చేస్తున్నారు అని సుమన్ శెట్టి అడిగితె నేను హ్యాండ్ వాష్ చేసుకుంటానికి వెళ్ళాను అంది.
మీరు అక్కడి నుంచి(బెడ్ రూమ్) డస్ట్ బిన్ తియ్యమని మాధురి, సుమన్ శెట్టి చెబితే నేనేమన్నా పనిమనిషినా అంటూ.. నేనే డస్ట్ బిన్ కవర్ తీసి పడేసి కొత్త కవర్ వేస్తా అంది.. దానికి సుమన్ శెట్టి, మరో కెప్టెన్ గౌరవ్ కుదరదు అది వేరే వారి పని అన్నారు. మీరు రూల్స్ ఫాలో అవడం లేదు అంది సంజన. దానికి మేము చెబితే మీరు ఫాలో అవ్వడం లేదు అంటూ కాస్త గట్టిగానే సంజన, సుమన్ శెట్టి గొడవపడ్డారు.




కేసీఆర్ గారు బయటకి రారా 

Loading..