Advertisementt

స్టేటస్ లతో ఒణుకు పుట్టిస్తున్న కొలికపూడి

Thu 23rd Oct 2025 09:25 PM
kolikapudi  స్టేటస్ లతో ఒణుకు పుట్టిస్తున్న కొలికపూడి
MP Sivanath vs Kolikapudi స్టేటస్ లతో ఒణుకు పుట్టిస్తున్న కొలికపూడి
Advertisement
Ads by CJ

తిరువూరు ఎమ్యెల్యే కొలికపూటి శ్రీనివాస్ టీడీపీ కి పంటికింద రాయిలా మారారు. అధిష్టానికి వ్యతిరేఖంగా కొలికపూడి చేస్తున్న ఆరోపణలు టీడీపీ పార్టీకి తలనెప్పిగా మారింది. రీసెంట్ గా ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన దారుణమైన కామెంట్స్ తో కొలికపూడి కి అధీష్టానం నుంచి పిలుపొచ్చింది. రేపు శుక్రవారం మంగళగిరి లోని పార్టీ ఆఫీసుకి పిలిపించారు. 

తాజాగా ఎంపీ చిన్ని పీఏకి తిరువూరులో ఏం పని అంటూ మాట్లాడిన కొలికపూడి ఇప్పుడు కేశినేని చిన్నిపై తీవ్రమైన ఆరోపణలు చెయ్యడమే కాదు ఆయన ఫోన్ వాట్సాప్ స్టేటస్ లో పెడుతున్న పోస్ట్ లు పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి. ఎన్నికల టికెట్ కోసం ఎంపీ కేశినేని తనను ఐదు కోట్లు అడిగారని,  తాను డబ్బులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించడం, అందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.

అంతేకాదు తిరువూరు ఏమైనా పార్క్ అనుకున్నారా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళడానికి అంటూ కొలికపూడి కేశినేని చిన్ని, ఆయన పీఏ పై ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

కొంత కాలంగా ఎంపీ కేశినేని చిన్ని కి కొలికపుడి కి మధ్య ఆరోపణల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు అది ముదిరిపాకాన పడింది. కొలికపూడి ఆరోపణతో టీడీపీలో ఆందోళన అసహనం మొదలైంది... ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కొలికపూడి వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. మరి ఈ వివాదాన్ని టీడీపీ అధిష్టానము ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. 

MP Sivanath vs Kolikapudi :

Rivalry between Vijayawada MP Sivanath and Tiruvuru legislator Srinivasa Rao

Tags:   KOLIKAPUDI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ