Advertisementt

ఆడియో క్లిప్‌ల‌పై యంగ్ హీరో వివ‌ర‌ణ‌

Tue 21st Oct 2025 10:34 AM
ajmal ameer  ఆడియో క్లిప్‌ల‌పై యంగ్ హీరో వివ‌ర‌ణ‌
Young Hero on his Audio clips ఆడియో క్లిప్‌ల‌పై యంగ్ హీరో వివ‌ర‌ణ‌
Advertisement
Ads by CJ

ఆన్ లైన్ లో లైంగిక దుష్ప్ర‌వ‌ర్త‌న‌కు పాల్ప‌డ్డాడంటూ యంగ్ హీరో అజ్మ‌ల్ అమీర్ పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రు మ‌హిళ‌ల‌కు అస‌భ్య‌క‌ర సందేశాలు పంపాడ‌ని, ఇబ్బందిక‌రంగా మాట్లాడాడు అని చెబుతూ కొన్ని ఆడియో రికార్డింగులు ఆన్ లైన్ లోకి వ‌చ్చాయి. ఆడియో క్లిప్‌లు, స్క్రీన్ షాట్లు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. అయితే ఇదంతా త‌న‌పై త‌ప్పుడు ప్రచారం చేయ‌డానికేన‌ని అజ్మ‌ల్ అమీర్  వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు.

ఆ ఆడియో క్లిప్‌లు ఏఐలో జ‌న‌రేట్ చేసిన‌వి. కృత్రిమ మేధ‌స్సు(ఏఐ)తో ఇలాంటి క్లిప్ ల‌ను త‌ప్పుడు ఉద్ధేశంతో త‌యారు చేసార‌ని అత‌డు అన్నారు. దీనిని ఎడిటర్ సులువుగా గ్ర‌హించ‌గ‌ల‌ర‌ని కూడా అజ్మ‌ల్ అన్నారు. అయితే త‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన స‌మ‌యంలో మ‌ద్ధ‌తుగా నిలిచిన అభిమానుల‌కు అత‌డు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అవ‌న్నీ క‌ల్పితం.. బూట‌కం.. ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు వాటిని ఖండించేందుకు నా సొంత పీఆర్వో కూడా లేరు.

నేను అలాంటి వాటిని మేనేజ్ చేయ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని ఆవేద‌న చెందాడు. అంతేకాదు.... త‌న పేరుతో ఉన్న సోష‌ల్ మీడియా ఖాతాను ఇక‌పై తానే స్వ‌యంగా నిర్వ‌హిస్తాన‌ని తెలిపాడు. అజ్మ‌ల్ అమీర్ తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించారు. జీవా క‌థానాయ‌కుడిగా న‌టించిన రంగం చిత్రంలో అజ్మ‌ల్ న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌కు గొప్ప పేరొచ్చింది. ఇటీవ‌ల విజ‌య్ `ది గోట్‌`లో అత‌డు న‌టించాడు.

రామ్ చ‌ర‌ణ్ ర‌చ్చ‌లోను అజ్మ‌ల్ న‌ట‌న‌కు మంచి పేరొచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అత‌డు కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నాన‌ని, దుబాయ్ లో షూటింగ్ లో ఉన్నాన‌ని కూడా తెలిపాడు.

Young Hero on his Audio clips:

  Ajmal Ameer on  viral audio controversy  

Tags:   AJMAL AMEER
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ