సమంత కొన్ని నెలలుగా దర్శకుడు రాజ్ నిడమోరు తో డేటింగ్ లో ఉంది అనే రూమర్స్ ని సమంత పదే పదే నిజం చేస్తూనే ఉంది. తన లైఫ్ లో జరుగుతున్న ప్రతి ఇంపార్టెంట్ అకేషన్ లోను సమంత తో రాజ్ కనిపిస్తున్నాడు. రీసెంట్ గా ఆమె ముంబై లో కొత్తిల్లు తీసుకుని దాని గృహప్రవేశాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించింది. ఆ ఈవెంట్ లో ను రాజ్ కనిపించారు.
తాజాగా సమంత దివాళి సెలెబ్రేషన్స్ ను రాజ్ నిడమోరు ఫ్యామిలీతో కలిసి చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం అందరికి షాకిచ్చింది. దర్శకుడు రాజ్ తో కలిసి ఆయన ఫ్యామిలీతో సమంత దీపావళి పండగను జరుపుకున్నారు. సమంత టపాసులు కలుస్తూ చాలా సంతోషంగా కనిపించింది.
ఇదంతా చూసి సమంత రాజ్ తో కలిసి రిలేషన్ లో ఉన్న విషయాన్ని బయటపెట్టొచ్చుగా అంటూ అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.