Advertisementt

క్లాసిక్ DDLJకు 30 ఏళ్లు

Tue 21st Oct 2025 10:07 AM
dilwale dulhania le jayenge  క్లాసిక్ DDLJకు 30 ఏళ్లు
Classic Dilwale Dulhania Le Jayenge Turns 30 క్లాసిక్ DDLJకు 30 ఏళ్లు
Advertisement
Ads by CJ

 

ప్రేమ‌క‌థా చిత్రాల ఒర‌వ‌డిని మార్చిన సినిమా... భార‌తీయ సంస్కృతి, కుటుంబ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన గ్రేట్ మూవీ - `దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే` విడుద‌లై నేటితో 30 ఏళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఈ మ్యూజిక‌ల్ హిట్ గురించి క‌థానాయ‌కుడు షారూఖ్‌తో పాటు, క‌థానాయిక కాజోల్ ఎమోష‌న‌ల్ గా స్పందించారు.

ఈ సినిమా ప్ర‌పంచానికి భార‌తీయ‌ సంస్కృతిని నేర్పించింద‌ని ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ సినిమా చూసిన త‌ర్వాత మేము పెళ్లి చేసుకున్నామ‌ని, లేదా ప్రేమ‌లో ప‌డ్డామ‌ని చెప్పిన జంట‌లు ఉన్నాయని ఖాన్ గుర్తు చేసుకున్నారు.

స్విట్జ‌ర్లాండ్ స‌హా యూకేలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో `దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే` (డిడిఎల్‌జే) తెర‌కెక్కింది. ఈ సినిమా గురించిన మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం కూడా తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

నిజానికి ద‌ర్శ‌కుడు ఆదిత్య చోప్రా ఈ సినిమా క‌థ‌ను ఇండో- అమెరిక‌న్ ప్రేమ‌క‌థ‌గా రూపొందించారు. ఇందులో టామ్ క్రూజ్ న‌టిస్తే బావుంటుంద‌ని భావించారు. కానీ నిర్మాత య‌ష్ చోప్రా స్క్రిప్టు విన్న త‌ర్వాత దీనిని ఇద్ద‌రు భార‌తీయ ఎన్నారైల ప్రేమ‌క‌థా చిత్రంగా మార్చాల‌ని సూచించారు. ఆ త‌ర్వాత‌ షారూఖ్ తో అది వ‌ర్క‌వుటైంది.  

Classic Dilwale Dulhania Le Jayenge Turns 30:

30 Years For Iconic Dilwale Dulhania Le Jayenge

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ