ముంబై లో సమంత కోట్లు పెట్టి కొత్తిల్లు కొనుక్కుని న్యూ బిగినింగ్ అంటూ తన కొత్తింటి ఫొటోస్ ని పంచుకుంది. ఆతర్వాత సమంత కొత్తింట్లో సాంప్రదాయబద్దంగా గృహ ప్రవేశం చేస్తూ పూజలు నిర్వహించడం, తన ఇంట్లోనే స్పెషల్ గా పూజ గదిని కట్టించుకోవడం ఇలా ప్రతి ఒక్క విషయాన్నీ అభిమానులతో షేర్ చేసుకుంది.
ఇపుడు తన కొత్తింట్లో సమంత ఈ ఏడాది దీపావళిని సెలెబ్రేట్ చేసుకుంది. సమంత కొత్తింట్లో చేసుకున్న దీపావళి సెలెబ్రేషన్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివాళి కి ముందు రోజు ప్రత్యూష ఫౌండేషన్ లో అనాధ పిల్లతో కలిసి దివాళి ని సెలెబ్రేట్ చేసుకుంది.
ముంబైలో కొన్న తన ఇంటికి SAM అంటూ తన పేరునే పెట్టుకుంది. ఇక ఈ దివాళి కి సమంత తన కొత్తింటిని అలంకరించి ట్రెడిషనల్ గా చేసుకోవడం మాత్రం తెగ హైలెట్ అవుతుంది.