Advertisementt

NTR-Neel కాంబో పై షాకింగ్ న్యూస్

Mon 20th Oct 2025 05:04 PM
ntr  NTR-Neel కాంబో పై షాకింగ్ న్యూస్
Shocking news on NTR-Neel combo NTR-Neel కాంబో పై షాకింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో లో మొదలైన డ్రాగన్(వర్కింగ్ టైటిల్) NTR-Neel ప్రాజెక్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ చివరికొచ్చేస్తుంది. సినిమా విడుదలకు కేవలం మూడు నెలల సమయమే ఉంది. రిపబ్లిక్ డే స్పెషల్ గా సినిమా రిలీజ్ అంటూ మేకర్స్ ఎప్పుడో ఎనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు ఈ కాంబో పై షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయ్యింది . 

అసలు సోషల్ మీడియాలో NTR-Neel కాంబో పై వినబడుతున్న న్యూస్ ఏమిటి అంటే ఇప్పటివరకు జరిగిన షూటింగ్ అవుట్ ఫుట్ పై ఎన్టీఆర్ సంతృప్తిగా లేడు అని.. ఇంతవరకు జరిగిన షూటింగ్ విషయంలో ఎన్టీఆర్ పునరాలోచనలో ఉన్నాడని, కథను మార్చడమా లేదంటే లైన్ మార్చడమా అనే విషయంలో ప్రస్తుతం హీరో-దర్శకుడు ఆలోచనలో ఉన్నారంటున్నారు. 

ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ జరగడం లేదు అని ప్రొడ్యూసర్ చెప్పడం మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతుంది. చిన్న ఇబ్బంది అంటున్నా ప్రొడ్యూసర్ చెప్పినదాన్ని బట్టి రెండు నెలలుగా డ్రాగన్ షూటింగ్ జరగకపోతే సినిమా అనుకున్న సమయానికి రాదు అనేది వారి ఆందోళనకు కారణం. ఈ విషయంలో మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

Shocking news on NTR-Neel combo:

NTR-Neel movie update

Tags:   NTR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ