హీరో కిరణ్ అబ్బవరం నటించిన K-ర్యాంప్ రెండు రోజుల క్రితమే దివాళి స్పెషల్ గా విడుదలై హిట్ టాక్ ని కంటిన్యూ చేస్తోంది. ఈ దీపావళికి రిలీజైన చిత్రాల్లో ఛాంపియన్ గా నిలిచిన ఈ సినిమా డే బై డే కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. మొదటి రోజును మించిన వసూళ్లు రెండో రోజు ఈ సినిమాకు దక్కాయి.
రెండు రోజుల్లో 11.3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది K-ర్యాంప్. ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు రీచ్ చేయడంలో హీరో కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యారు. ఆయన చేసిన టూర్స్ వల్ల మూవీపై క్రేజ్ ఏర్పడింది. మాస్, యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు K-ర్యాంప్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. బీ, సీ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతోందీ మూవీ.
K-ర్యాంప్ సినిమాకు క్రిటిక్స్ నుంచి వచ్చిన రివ్యూస్ కు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వస్తున్న కలెక్షన్స్ కు ఏమాత్రం పొంతన లేదు. రివ్యూస్ తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ ఆదరణతో డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తోంది K-ర్యాంప్.