Advertisementt

పెద్ది డైరెక్టర్ కి రామ్ చరణ్ వార్నింగ్

Sun 19th Oct 2025 01:32 PM
ram charan  పెద్ది డైరెక్టర్ కి రామ్ చరణ్ వార్నింగ్
Ram Charan concerned for Peddi director పెద్ది డైరెక్టర్ కి రామ్ చరణ్ వార్నింగ్
Advertisement
Ads by CJ

పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కి పెద్ది హీరో రామ్ చరణ్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. కారణమేమిటంటే బుచ్చిబాబు నిద్రాహారాలు మానేసి పెద్ది షూటింగ్ లో తలమునకలైపోవడమేనట. వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్ డే కి అంటే మార్చ్ 27 న పెద్ది చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ పెద్ది మేకర్స్ టార్గెట్ సెట్ చేయడంతో  బుచ్చిబాబు పెద్ది షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. 

రిలీజ్ డేట్ దగ్గరికొస్తుండటంతో యూనిట్ మొత్తం స్పీడ్ పెంచింది. పెద్ది ఫస్ట్ సింగిల్ ని ఏ ఆర్ రెహమాన్ చేస్తున్నారు. అటు బుచ్చిబాబు కూడా టార్గెట్ దగ్గర పడుతుండడంతో పెద్ది షూటింగ్ చేస్తూనే రాత్రిళ్లు ఎడిటింగ్, మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటూ తిండి కూడా సరిగా తినడం లేదని దానితో బుచ్చిబాబు ఆరోగ్యం కాస్త దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. 

బుచ్చిబాబు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా.. ఆయన మాత్రం వెనక్కి తగ్గకుండానే పనిని కొనసాగిస్తున్నారని తెలిసి రామ్ చరణ్ బుచ్చిబాబు పై సీరియస్ అయ్యారట. బుచ్చిబాబు ఆరోగ్యం విషయం రామ్ చరణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే బుచ్చిబాబుతో మాట్లాడి హెల్త్ మేనేజ్ చేసుకోవాలని సీరియస్‌గా చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ బుచ్చిబాబుతో మాట్లాడి ముందు ఆరోగ్యం, హెల్త్ మేనేజ్ చేసుకోవాలని, ఆతర్వాతే పని అని బుచ్చిబాబు కి ప్రేమతో చెబుతూనే చరణ్ ఆల్మోస్ట్ వార్నింగ్ ఇచ్చినంత పని చేశారట.  

Ram Charan concerned for Peddi director :

Ram Charan concerned for Peddi director Buchi Babu

Tags:   RAM CHARAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ