బిగ్ బాస్ 9 సీజన్ లో క్యూట్ గా స్వీట్ గా ఆకట్టుకుంటున్న కన్నడ పిల్ల తనూజ ఇప్పుడు హౌస్ లో ఒంటరి పోరాటం చేస్తుంది. భరణి ని నాన్నా అంటూ ఎమోషనల్ గా కనెక్ట్ అయితే.. భరణి ముందు రెండు వారాలు బాగానే ఉన్నప్పటికీ దివ్య రాగానే దివ్య వైపు వెళ్ళిపోయాడు. దానితో తనూజ బాగా హార్ట్ అయ్యి భరణి కి దూరంగా ఉండిపోయింది.
ఇక ఇమ్మాన్యువల్ తో ఫ్రెండ్ షిప్ ని కూడా తనూజ దూరం చేసుకుంది. ఇమ్మాన్యువల్ తనపై జోక్స్ వెయ్యడం నచ్చలేదు అంటూ ఇమ్ము ని దూరం పెట్టింది. ఆతర్వాత హౌస్ లోకి రాగానే అయేషా తనూజ ని డైరెక్ట్ గా టార్గెట్ చేసింది. తనూజా బాండింగ్స్ తో ఫైనల్ కి వెళ్లాలని చూస్తుంది అంటూ గుచ్చి గుచ్చి మాట్లాడింది.
ఇక కళ్యాణ్ తో తనూజ ఫ్రెండ్ గానే ఉన్నా కళ్యాణ్ కాస్త ఓవర్ చేసాడు. కానీ ఇప్పుడు బావున్నప్పటికీ కళ్యాణ్ పై బయట ఆడియన్స్ లో సదభిప్రాయం లేదు. దానితో వీడియో వేసి వైల్డ్ కార్డు ఎంట్రీస్ తనూజ -కళ్యాణ్ ల గురించి ఏం మాట్లాడుకుంటున్నారో నాగార్జున చూపించారు. అలా తనూజ కళ్యాణ్ ని కూడా దూరం పెట్టొచ్చు. ఇక సుమన్ తో ఫ్రెండ్ షిప్ ని అతన్ని నామినేట్ చేసి చెడగొట్టుకుంది.
తనూజ తన కోసం త్యాగం చేసినా సంజన మాత్రం తనూజ యాక్ట్ చేస్తుంది జన్యున్ గా లేదు అంటూ వెనుకగా మాట్లాడం, రాము కూడా తనూజ తో గొడవ పెట్టుకోవడం తో మొత్తం మీద తనూజ ఒంటరిదైపోయింది. మరి బిగ్ బాస్ హౌస్ ఇకపై తనూజ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.