ప్రస్తుతం టీడీపీ పార్టీలో ఏం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని పట్టించుకుంటున్నారా, నారా లోకేష్ ఏం చేస్తున్నాడు. టీడీపీ లో ఒకరికోరు కొట్టుకు చస్తుంటే వీళ్లంతా ఎక్కడా అంటూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కారణం తిరువూరు ఎమ్యెల్యే కొలికపూడి పదే పదే పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.
ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం వద్దకు వెళ్లి పరిష్కరించుకోవడం మానేసి పార్టీ ప్రతిష్ట దిగార్చేలా వ్యవహరించడం టీడీపి పార్టీకి తలపోటుగా మారింది. పార్టీ ఎన్నిసార్లు హెచ్చరించినా తిరువూరు ఎమ్యెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు మార్చుకోకుండా టీడీపీ కి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.
ఇప్పుడు కూడా సొంత పార్టీ ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తుంటే.. ఆయన పీఏ కిషోర్ మాత్రం అన్నిచోట్లా ముఖ్యంగా తిరువూరులో దందా నడిపిస్తున్నాడని.. తిరువూరులో కిషోర్ ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడని కొలికపూడి ఎంపీ కేశినేని చిన్ని పై సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.
అంతేకాకుండా అధిష్టానికి తెలియకుండా పార్టీ పదవులను సైతం చిన్ని పీఏ కిషోర్ అమ్ముకుంటున్నాడని, అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని కొలికపూడి అన్నారు. మరి ఈ విషయాన్నీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.