ఈ శనివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి బొమ్మ చూపించేందుకు హోస్ట్ నాగార్జున రెడీ అయ్యారు. ఈరోజు ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన రమ్య, మాధురి లు హౌస్ మేట్స్ తో ఎలా సీక్రెట్ గా మాట్లాడుతున్నారు, డిమాన్ పవన్, కళ్యాణ్ లు అమ్మాయిలతో చేసే స్నేహం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి, తనూజ-కళ్యాణ్ మధ్యన ఏమి నడుస్తుంది అనేది నాగార్జున వీడియోస్ వేసి షాకిచ్చారు.
రీతూ, పవన్ ని సీక్రెట్ రూమ్ కి పిలిచి పవన్-రమ్య కలిసి మాట్లాడుకుంటూ రీతూ ని పవన్ వాడుకుంటున్నాడు, మీ మధ్యన ప్రేమ ఉంది అదే బయట చూసాను అని రమ్య చెప్పిన వీడియో ఉండగా.. రీతూ షాకవుతూ.. నేను క్లారిటీగా ఉన్నాను, నా ఆట నేను ఆడుతున్నాడు అంది.. పవన్ రీతూ తో ఫేక్ గా ఉన్నాడా అని ఆడియన్స్ ని అడిగితే అందరూ యునానమస్ గా 100 శాతం అన్నారు.
ఆతర్వాత రమ్య-కళ్యాణ్ లను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి రమ్య.. మధురితో ఉన్న వీడియో వేశారు. కళ్యాణ్ గనక నా మీద చేతులు వేసి మాట్లాడినా, నా మీద పడితే తొక్కేస్తాను అంటూ మాట్లాడిన వీడియో చూపించగానే కళ్యాణ్ షాక్ అయ్యాడు. కళ్యాణ్ కి అమ్మాయిల పిచ్చి ఉందా అన్నారు నాగ్. తనూజ ను సీక్రెట్ రూమ్ కి పిలిచి మాధురి-రమ్యలు తనూజ, కళ్యాణ్ లపై మాట్లాడుకున్న వీడియో చూపించారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ రమ్య-మాధురి మాట్లాడిన వీడియో చూసి తనూజ షాకయ్యింది.
అంతేకాదు నాగార్జున బ్రేక్ తీసుకుని వచ్చాక ఇమ్మాన్యువల్ కి పగిలిపోతుంది అంటూ నాగార్జున అనడంతో ఇమ్మాన్యువల్ ఏమి అర్ధం కాక తెల్లమొహం వేసాడు. అది ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో హైలైట్స్.