తండ్రి కేసీఆర్ పేరు అక్కర్లేదు, ఆయన ఫోటో తో ముందుకు వెళ్లి బాగుపడాలని లేదు అంటూ సింగిల్ గానే తన రాజకీయ యాత్రను స్టార్ట్ చేసిన కవిత.. ఇప్పుడు తన వారసుడు ని రాజకీయాల్లోకి దించడం హాట్ టాపిక్ గా మారింది. కొత్త పార్టీ పెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర మొదలు పెడతాను అంటూ బయలుదేరిన కవిత నేడు BC ధర్నాలో కుమారుడుతో కలిసి పాల్గొంది.
అంటే కొడుకు కాస్త మెచ్యూరిటీ ఉన్నవాడు అయితే పర్లేదు. ముక్కు పచ్చలారని కొడుకుని జాగృతి ఆద్వర్యంలో జరిగిన BC ధర్నాలో కూర్చోబెట్టడమే అందరిని విస్మయానికి గురి చేసింది. పార్టీ పెట్టలేదు కానీ కొడుకుని మాత్రం హైలెట్ చెయ్యడానికి కవిత ప్రయత్నం చెయ్యడం షాకిచ్చింది.
రాజకీయాల్లో తల పండిన తండ్రి కేసీఆర్ ని కాదని ఇలా కొడుకుని తన పక్కన చేర్చుకోవడం పై కవిత ఎలాంటి సంధానమిస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతం BC ధర్నాలో కవిత కొడుకు కనిపించడం మాత్రం మీడియా లో తెగ హైలెట్ అవుతోంది.